నాణ్యతలో రాజీలేకుండా నిర్మాణాలు జరగాలి


Ens Balu
7
2022-10-15 11:20:26

నాణ్యతలో రాజీలేని విధంగా రోడ్ల నిర్మాణాలు ఉండాలని, నాణ్యత పై ఎన్ఫోర్స్మెంట్ తనిఖీకిలు ఉంటాయని జిల్లా కలెక్టర్పి ప్రశాంతి ఆర్ ఆర్ అండ్ బి అధికారులకు హెచ్చరించారు. శనివారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ జిల్లాలో ఆర్ అండ్ బి చేపట్టే రోడ్లపై సంబంధిత  అధికారులతో సమీక్షించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటివరకు చేసిన రోడ్ల మరమ్మతులు యధాస్థితికి రావడం పై అసహనం వ్యక్తం చేశారు. నిత్యం ప్రయాణించే రోడ్లే ప్రమాదానికి కారణం అయితే పరోక్షంగా మీరే బాధ్యులు అన్నారు.  ఉండి బైపాస్ రోడ్డు పరిస్థితి చూస్తుంటే  జిల్లా యంత్రాంగం పనితీరుకు మచ్చలాగా ఉందన్నారు.  గుంతలోని తేమ మీద ప్యాచ్ వర్క్ చేయడం వల్ల ఉపయోగం లేకుండా పోతుందన్నారు.  

ప్రాంతాలవారీగా పరిస్థితులను అంచనావేసి అందుకు అనుగుణంగా రోడ్లు చేపడితే ఎక్కువ మన్నిక  ఉంటాయని ఆ విధంగా ఆర్ అండ్ బి అధికారులు ఆలోచన చేయాలన్నారు.  లో లైన్ ఏరియాలో అవసరమైనచోట్ల కల్వర్టులు ఏర్పాటుచేసి రోడ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు. మొత్తం పాడై పోయేవరకు కాకుండా రవాణాకు అనుగుణంగా చిన్న, చిన్న మరమ్మత్తులు వెంటనే చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర రిప్లై నిమిత్తం 32 పనులకు మంజూరు కోరగా స్టేట్ హైవే రోడ్స్ 15 మంజురు అయ్యాయని, అలాగే విలేజ్ కనెక్టివిటీ రోడ్స్ 20 మంజూరైనట్లు ఆర్ అండ్ బి అధికారులు జిల్లా కలెక్టర్ తెలిపారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించి వర్షాలు లేకపోతే అక్టోబర్ 28 నుండి రోడ్ల పనులు ప్రారంభించనున్నట్లు వారు జిల్లా కలెక్టర్ కు తెలిపారు.  

ఒక ఇంజనీరుగా రోడ్డు ఎలా వేస్తే ఎక్కువ కాలం మన్నిక వస్తుందో మీ అందరికీ తెలిసిందేనని, రోడ్లు నిర్మాణాలలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని జిల్లా కలెక్టర్ వారికి సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఆర్ అండ్ బి ఇంజనీరింగ్ అధికారి ఎస్. లోకేశ్వరరావు, డి ఈ లు రామరాజు, ఎస్వి రమణ, జి వి ఎస్ కిరణ్ కుమార్,  ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు.