హోం ఐసోలేషన్ లో ఉన్నావారిని రోజూ సందర్శించాలి..
Ens Balu
2
Tirupati
2020-09-22 18:47:03
హోం ఐసోలేషన్ లో ఉన్న కొవిడ్ పాజిటివ్ వ్యక్తులను ఎవరో ఒక వైధ్య సిబ్బంది ప్రతి రోజు సందర్శించేలా వైధ్యాదికారులు ప్రణాళికను సిద్దం చేసి పరీక్షలు నిర్వహణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్త పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుండి జెసి(డి) లతో కలసి వైద్య అధికారులతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించి దిశా నిర్ధేశం చేశారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజులలోపు జరిగిన కరోనా మరణాల పై పి.హెచ్.సి. స్థాయిలో, సబ్ సెంటర్ పరిధిలో అలాగే గ్రామ/ వార్డు సచివాలయ పరిధిలో అందుకు గల కారణాల పై సమీక్షలు నిర్వహించి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ట్రయాజింగ్ పెండెన్సీ ఎక్కువగా ఉన్న వైధ్యాదికారుల మీద ఏ.ఎన్.ఏం లు సూపర్ వైజర్ల మీద అందుకు గల కారణాలను సమీక్షించి అలసత్వం వహించిన వారి పై శాఖా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని వైధ్యాదికారులు, ఏ.ఎన్.ఏం లు, సూపర్ వైజర్లు సందర్శించి వారికి వైద్య పరీక్షలు నిర్వహించి డేటా ఎంట్రీ చేయని వారి పై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో ఏ.ఎన్.ఏం, ఆశాలు కరోనా లక్షణాలు ఉన్న వారిని త్వరగా గుర్తించి వారికి కరోనా పరీక్షలు నిర్వహించి ట్రయాజింగ్ చేసి హోం ఐసోలేషన్ లో లేదా కోవిడ్ ఆసుపత్రికి తరలించడం మరియు కోవిడ్ మరణాలు అను అంశాల పై సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. పట్టణ స్థాయిలో హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారిని వార్డు ఏ.ఎన్.ఏం లు, సూపర్ వైజర్లు తక్కువగా సందర్శించడం జరుగుతున్నదని ప్రతి మూడు రోజులకు ఒక సారి ఏ.ఎన్.ఏం నాలుగు రోజులకు ఒకసారి వైధ్యాదికారులు సందర్శించి వారికి సాదారణ పరీక్షలు నిర్వహించాలని అలా చేయని వారి పై చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్న వారిని ఎవరో ఒక వైధ్య సిబ్బంది ప్రతి రోజు సందర్శించేలా వైధ్యాదికారులు ప్రణాళికను సిద్దం చేసుకొని అందుకు తగ్గట్టుగా పర్యవేక్షణ చేసి డేటా ఎంట్రీ చేపట్టాలన్నారు. కరోనా వ్యాధి గ్రస్తులను వైధ్యాదికారులు మరియు వైధ్య సిబ్బంది వ్యక్తి గతంగా సందర్శించడం గాని లేదా ఫోన్ ద్వారా పరామర్శించి వారి ఆరోగ్య సమాచారం తెలుసుకోవడం ద్వారా వారు చాలా సంతృప్తి చెంది మనో దైర్యంగా ఉండేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నుండి డి.పి.ఏం.ఓ డాక్టర్ శ్రీనివాస్, డెమో నిర్మలమ్మ, ఎపిడమాలజిస్ట్ శ్రీవాణి, తదితరులు పాల్గొన్నారు.