రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే నగరం అభివృద్ధి చెందినట్లు జివిఎంసీ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. మంగళవారం నగరంలోని రెండవ జోన్ 13వ వార్డు పరిధిలోని పైనాపిల్ కాలనీలలో సుమారు 56 లక్షల రూపాయల అంచనా వ్యయంతో రోడ్లు కాలువలకు ఆమె తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అక్రమాన్ని విజయనిర్మల, వార్డ్ కార్పొరేటర్ కెల్లా సునీత సత్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ విశాఖ పరిపాలనా రాజధానిగా ఉంటే ఉత్తరాంధ్ర ఎంతో అభివృద్ధి చెందుతుందని నమ్మి జగనన్న విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నారని తెలిపారు.
నేడు ప్రతి వార్డు లో కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని పరిపాలన రాజధాని ఇక్కడ ఉంటే మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మన వార్డు కార్పొరేటర్ సునీత సత్యనారాయణ విన్నపం మేరకు ఇప్పటికే పలు అభివృద్ధి కార్యక్రమాలు వార్డులో చేపట్టామని నూతనంగా రోడ్లు కాలువలు నిర్మాణానికి 56 లక్షల రూపాయలు కేటాయించి నేడు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులు కార్యదర్శులు వైయస్సార్ సిపి నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.