జాతీయ దివ్యాంగుల ఆర్ధిక, అభివృద్ధి సంస్థ (NHFDC) న్యూఢిల్లీ ద్వారా దివ్యాంగులకు రుణము కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి ఒక ప్రకటనలో తెలిపారు. అనకాపల్లి జిల్లాకు చెందిన అర్హులైన దివ్యాంగులు 40% అంగవైకల్యము 18 నుండి 60 సం.లవయస్సు కలవారు (మానసిక వికలాంగులు 14 సం.) రుణము పొందుటకు అర్హులని చెప్పారు. రుణము మొత్తం తిరిగి పూర్తిగా వడ్డీతో సహా చెల్లించ వలసి ఉంటుందన్నారు. రూ.10 వేల నుండి 50 వేల వరకు 5%, ఆపై రూ. లక్ష వరకు వడ్డీ 6% వడ్డీ ఉంటుందన్నారు దరఖాస్తు కొరకు ఏడి సంక్షేమ శాఖ వారి కార్యాలయంలో సంప్రందించాలన్నారు. సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, విద్య, శిక్షణ దృవీకరణ పత్రాలు, బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకము కాపీ, 2 పాస్ పోర్టు సైజు ఫోటోలు, రూ. లక్ష దాటినట్లెతే సంబందిత పరిశ్రమల శాఖ వారి నుంచి పొజెక్టు రిపోర్టు సమర్పించాలన్నారు.
ఈ రుణాలు చిన్న వ్యాపారములకు వ్యాపార అభివృద్ధి చేసుకొనుటకు మంజూరు చేస్తారని వివరించారు. రూ.లక్ష వరుకు షూరిటీగా 5సం.ల సర్వీసుగల ప్రభుత్వ ఉద్యోగి, రూ.లక్షకు దాటినట్లయితే 10 సం. సర్వీసు గల ప్రభుత్వ ఉద్యోగిషూరిటీ ఉండాలన్నారు. లేనట్లయితే బ్యాంకు గ్యారంటీ లేదా ఆస్తి తాలుకా ఒరిజనల్ దస్తావేజులు కూడా షూరిటీగా పెట్ట వచ్చని చెప్పారు. SC/ ST/ BC మరియు మహిళా అభ్యర్ధులకు పాదాన్యత ఇవ్వబడుతుందని, మహిళా దివ్యాంగులకు వడ్డీలో ఒక శాతం రిబేట్ ఇస్తారని చెప్పారు. రూ. లక్ష వరకు లోను తీర్చుటకు 3 సం.లు, రూ. 5 లక్ష ల వరకు లోనుకు 5 సం.లుగా కాల పరిమితి ఉంటుందన్నారు. దరఖాసులు పరిశీలన, ఎంపిక మరియు లోను మంజూరు కార్యక్రమములు జిల్లా స్క్రీనింగ్ కమిటీ (DLSC) ద్వారా జరుగుతుందన్నారు. అసలైన వికలాంగ అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆమె కోరారు. ఇతర వివరముల కొరకు పోన్ నెం. 9493291018 ద్వారా తెలుసుకోవచ్చని , విభిన్న ప్రతిభావంతులు, సహాయ సంచాలకులు జి.వి.పి.జగదీష్ తెలిపారు.