క్యాన్సర్ ఆస్పత్రికి ఏసిలు విరాళం..
Ens Balu
3
Anantapur
2020-09-22 18:51:31
అనంతపురంలోని ప్రభుత్వ క్యాన్సర్ ఆసుపత్రికి రెండు (2 టన్స్) ఎయిర్ కండీషనర్లు విరాళంగా అందజేశారు. నగరంలోని శారదా నగర్ లో ఉన్న ప్రభుత్వ క్యాన్స ర్ ఆస్పత్రిలో జాయింట్ కలెక్టర్ (విలేజ్ మరియు వార్డు సచివాలయం డిపార్ట్మెంట్) ఏ సిరి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కమీషనర్ పి వి వి ఎస్ మూర్తి విజ్ఞేప్తి మేర కు నగరపాలక సంస్థ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ మరియు ప్రైవేట్ ఏజెన్సీస్ వారి సహకారంతో 2 ఎయిర్ కండీషనర్లు విరాళంగా అందజే శా రు. అంతకుముందు జాయింట్ కలెక్టర్ ఆస్పత్రిలోని కరోన పాజిటివ్ పర్సన్ తో మాట్లాడుతూ వారికి అందించే భోజనం అక్కడ సదుపాయాలపై అడిగి తెలుసుకున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు కల్పించడమే ద్యేయంగా జిల్లా అధికారులు శ్రమిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి రాజేష్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.