రైతులు పండించే ఖరీఫ్ పంటను పొలంవద్దనే కొనుగోలు చేయుటకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజరు ఎం .దేవుళ్లనాయక్ తెలిపారు. మంగళవారం ఆయన కార్యాలయ చాంబరు నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజను సంబంధించిన వరిపంట కొనుగోలుకు అక్టోబరు మాసాంతానికిని ఏర్పాట్లు పూర్తిచేస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ వారు అందజేసిన నివేదకల ఆధారంగా జిల్లాలో మూడులక్షల పదహారువేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నామని, నవంబరు నెలనుండి ధాన్యం సేకరణ మొదలు పెడతామన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర (ఎ)రకానికి క్వింటాకు రెండువేల అరవై రూపాయలు, సాధారణ రకానికి రెండువేల నలబై రూపాయలు రైతులకు చెల్లించనున్నట్లు తెలిపారు.
రైతులు తప్పని సరిగా ఇ-పంట నమోదు చేసుకోవాలని, ఇ-పంట నమోదు చేయకపోతే ధాన్యం కొనుగోలు జరుగదన్నారు. మిల్లర్లకు రైతుకు సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పారదర్శకంగా ప్రక్రియ రూపొందించినదని, దానికి ఇ-పంట నమోదు తప్పనిసరని తెలిపారు. జిల్లాలో మూడు వందల ఆరు రైతుభరోసా కేంద్రాల వద్ద ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం సేకరణకు గోనుసంచులు పౌర సరఫరాలశాఖ, మిల్లర్లు సమకూర్చుతారని, రైతులు గోనెసంచులు సమకూర్చుకుంటే దానికి డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. ధాన్యం కోత పూర్తిచేసిన రైతులు సంబంధిత రైతుభరోసా కేంద్రంలో నమోదుచేసుకొని, ధాన్యం శాంపిల్స్, వేయింగుపూర్తయిన తరువాత రశీదు అందజేస్తారని, ఆ తరువాత రైతుకు సంబంధం ఉండదని తెలిపారు.
మిలర్లుగాని, మద్యవర్తులు గాని తూకం, నాణ్యత విషయంలో రైతులతో మాట్లాడే అవకాశం ఉండదని తెలిపారు. ధాన్యం అమ్ముకొనుటలో యిబ్బందులు ఎదురైనా, మిల్లర్లు సంప్రదించుటకు ప్రయత్నంచినా టోల్ నెంబరు 1902 గాని 15525 గాని 18004251903 గాని ఫోన్ చెయ్యాలని లేదా జిల్లా కంట్రోల్ రూం నెంబరు 08963-293037 లేదా 7702003582 కు పిర్యాదు చేయవచ్చునని తెలిపారు. జిల్లా లో తొంబదిఒక్క బియ్యం విల్లులు ఉన్నాయని వాటిలో ప్రస్తుతం ఇరవైఏడు మిల్లులు సార్టెక్స్, ఫ్లోరిఫైడ్ మిషనరీ కలిగిఉన్నాయని,త్వరలోనే ముప్పదిఎనిమిది మిల్లులకు సార్టెక్స్, ఫ్లోరిఫైడ్ మిషనరీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులు దళారులనుగాని, మిల్లర్లను గాని వారి ధాన్యం అమ్ముకొనుటకు సంప్రదించవద్దని, రైతు భరోసా కేంద్రాల ద్వారా వారి ధాన్యాన్ని అమ్ముకొని ప్రభుత్వం అందిస్తున్న మద్దతు ధర పొందాలని ఈ సంధర్బంగా రైతులకు కోరారు.