ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు ప్రక్రియలో అపుడే సిత్ర, ఇసిత్రాలు మొదలైపోయాయి. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత దాఖలవుతున్నా దరఖాస్తులన్నింటికీ ఓటు వస్తుందో.. రాదో తెలియని పరిస్థితి నెలకొంది. అభ్యర్ధులు ఫారం-18 తో పాటు కమిషన్ సూచించిన విధంగా ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నా ఆన్ లైన్ నమోదులో అవాంతరాలు ఎదరువుతున్నాయి. కొన్ని చోట్ల నేరుగా తహశీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి దరఖాస్తు ఇచ్చినా ఓటు నమోదువుతోందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో అభ్యర్ధులు దరఖాస్తుతోపాటు..తమ దరఖాస్తు ముట్టినట్టుగా ఎక్నాలడ్జ్ మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్రాలో ఇపుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. కొందరు సీనియర్ ఎమ్మెల్సీ ఓటర్లు మందు జాగ్రత్త చర్యగా ఈ విధంగా ముందుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసలు తమ ఓట్లు నమోదు అవుతున్నాయో లేదో అనే అనుమానాన్ని, ప్రభుత్వ అధికారులు తిరస్కరిస్తున్న దరఖాస్తులపై వామపక్షపార్టీలు అన్ని జిల్లాల కలెక్టర్లకూ ఫిర్యాదులు కూడాచేశారు.
ఎక్కడా ఇబ్బంది లేకుండా పక్కాగా ఓటు నమోదు అయ్యేవిధంగా చూసుకోవడంలో ఓటర్లు ఒక అడుగు ముందుకి వేస్తున్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు 2022 నోటిఫికేషన్ తరువాత జరిగే ఎన్నికలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. గతంలో ఓటు నమోదు చేసుకుంటే పక్కగా నమోదు అయ్యి ఓటరులిస్టులో కూడా పేర్లు ఉండేవి. కానీ ఇపుడు ఆ పరిస్థితి లేదనే భయం ప్రతీ ఓటరులోనూ పట్టుకుంది. దీనితో తమ ఓటు పోకుండా.. ఎక్కడ నమోదు కాకుండా ఉండిపోతుందోననే భయంగో దరఖాస్తు దారులు కాస్త ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకొని ఓటురుగా నమోదు అయ్యే ప్రక్రియలో సహచర పట్టభద్రలకు సహాయం అందిస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేయాలనుకునే అభ్యర్దులు కూడా వారి స్నేహితులు, టీమ్ ద్వారా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఓటు నమోదు ప్రక్రియ చేపడుతున్నారు. గతంలో అయితే ప్రభుత్వం నుంచి ఓటరు నమోదు విషయంలో గట్టిగా ప్రచారం జరిగేది. కానీ ఈసారి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత 15 రోజులకి ఎన్ని దరఖాస్తువు వచ్చేయనే విషయమై జిల్లా అధికారులు వివరాలు తెలియజేస్తున్నారు తప్పితే ఓటరును చైతన్యం చేసే కార్యక్రమాలు చేపట్టడం లేదు. దీనితో పోటీలో నిలబడే అభ్యర్ధులు మాత్రమే తమ ఓటర్లను కాపాడుకుంటూ, నమోదు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఓట్లు గల్లంతవుతాయనే భయంతో ఓటర్లు ఎక్నాలడ్జ్ మెంట్లు తీసుకోవడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది. దరకాస్తును తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది ఎక్కడా పడేయకుండా ఓటర్లు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్రా పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్లలో ఉన్న భయాన్ని, ఓటు నమోదు అవుతుందా, లేదా అనే విషయంలో నెలకొన్న అనుమానాలను రాష్ట్ర ఎన్నికల సంఘం నివ్రుత్తి చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం చాలా మంది దరఖాస్తు చేసుకున్న ఓటర్లలో తమ ఓటు నమోదు అవుతుందా లేదా అనుమానం అధికంగా ఉంటం కూడా ఈప్రాంతంలో హాట్ టాపిక్ అయ్యింది. ఓట్లు తక్కువగా నమోదు అయితే గెలుపు గుర్రాలకు పని సులవవుతుందనే కోణంలో ఈ విదంగా చేస్తున్నారా అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో ఓటర్లు, అభ్యర్ధుల అనుమానాలను, ప్రస్తుతం జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు, మండల తహశీల్దార్లు ఓటర్లకు భరోసా ఇవ్వాల్సి వుంది. చూడాలి ఈ విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది..!