కరోనా నుంచి కోలుకున్న 583 మంది డిశ్చార్జ్..


Ens Balu
4
కలెక్టరేట్
2020-09-22 18:56:38

అనంతపురం జిల్లాలో  కరోనా నుంచి కోలుకోవడంతో 583 మందిని డిశ్చార్జ్ చేసినట్లు జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు. మంగళవారం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, డిశ్చార్జి చేసిన వారిని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని  సూచించామని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్న వైద్యవిధానాలతో కరోనా వైరస్ వచ్చినప్పటికీ అధిక సంఖ్యలో రోగులు కోలుకుంటున్నారని చెప్పారు. డిశ్చార్జి చేసిన తరువాత ఐసోలేషన్ లో వున్న 14 రోజులు కూడా వారి ఆరోగ్యం ఎలావుందనే విషయమై సచివాలయ ఏఎన్ఎంలతో పర్యవేక్షణ చేపడుతున్నట్టు వివరించారు. డిశ్చార్జి అయినవారు జాగ్రత్తగా ఉండాలన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి బలవర్ధక ఆహారం తీసుకోవాలన్నారు. కోలుకున్నవారు తర్వాత ఏదైనా లక్షణాలు కనిపించినా ఆరోగ్యసిబ్బంది ద్వారా పీహెచ్సీల్లో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కలెక్టర్ సూచించారు.