గర్భీణిలు,బాలింతలకు మెరుగైన వైద్యం అందించాలి


Ens Balu
7
Visakhapatnam
2022-10-19 09:51:02

వైద్యం కోసం ఆసుపత్రకి వచ్చే గర్భీణి మరియు బాలింతలకు కార్పరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యం అందించాలని జిల్లా కలక్టరు డా.ఎ.మల్లిఖార్జున అన్నారు. బుధవారం ఉదయం  ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమావేశం లో జిల్లా కలక్టరు పాల్గోన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలక్టరు మాట్లాడుతూ ఆసుపత్రికి నూతనంగా మెటర్నీటి ఓటి, సిసి కెమెరాల ఏర్పాటు, ఆసుపత్రి భవన మరమత్తులకు, కార్ పార్కింగ్ షెడ్డుల నిర్మాణం, ఇంటర్నల్ రోడ్సు నిర్మాణం, అధనపు మరుగుదోడ్లు నిర్మాణం,  జనరేటరు నిర్వహణ షెడ్డు నిర్మాణం తదితర అంశాలపై ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రిలో ఇటీవల  పేషంట్ల కోసం  ఏర్పాటు చేసిన వసతి రూములను కలెక్టర్  తనిఖీ చేసి అక్కడ ఉన్న పేషెంట్లతో మాట్లాడి వారికి మరేమైనా అదనంగా సౌకర్యాలు  కావాలా అని   అడిగి తెలుసుకున్నారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను గురించి డ్యూటిలో ఉన్న నర్సులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక  కలెక్టర్ మరో విభాగంలో నూతనంగా నిర్మిస్తున్న 20 పడకల ఎసి షెడ్డును కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రెండు వారాలలో వాడుకలోకి తీసుకురావాలని ఆదేశించారు. ఆసుపత్రిలో వైద్యం అందుకుంటున్న రోగుల నిమిత్తం ఆసుపత్రిలో కిటికిలకు  దోమతెరలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్యం కోసం వచ్చేవారిని  పరామర్శించి వారికి వైద్యం మెరుగుగా అందుతుందా లేదా అన్నది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా వైద్యాధికారిణి  కె. విజయలక్ష్మి , ఆంధ్ర మెడికల్ కాలేజీ  ప్రిన్సిపాల్ డా.జి బుచ్చి రాజు,    ఎన్జీవో అండ్ సోషల్ వర్కర్ ప్రెసిడెంట్ ఆర్. రవికుమార్ ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.