మంచి వ్యవసాయ సాగు పద్దతులు పాటించి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాదించాలని జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్ తెలిపారు. బుధవారం పార్వతీపురం మన్యం ఐటిడిఎ గిరిజనమిత్ర భవనం లో నిర్వహించిన వ్యవసాయ అధికారులు, ఉద్యాన అధికారులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో అయన మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ శాఖల సిబ్బంది సమన్వయo తో పనిచేసి రైతులకు ఉత్తమ సేవలు అందించాలని తెలిపారు. జిల్లాలో సుమారు లక్షా ఇరవై వేల మంది రైతులకు చెందిన మూడు లక్షల నలబైఒక్క వేల ఎకరాలలో పంటలను ఇ-క్రాప్ నమోదు చేయడం జరిగిందని, దీనివలన ప్రభుత్య పధకాలు అమలుకు, భవిష్యత్తు ప్రణాళికలకు సులభతరం అవుతుందని తెలిపారు.
ప్రభుత్యం అమలు చేస్తున్న పధకాలను, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలు రైతుల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. రైతులు రసాయన ఎరువులు పరిమితికి మించి వాడకూడదని, మంచి వ్యవసాయ సాగు పద్దతులు పాటించాలని తెలిపారు. భుసార పరిక్షలు చేయుట ద్వారా పంటకు అవసరమైన ఎరువులు మోతాదు గుర్తించి వినియోగించాలని సూచించారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు ఆర్. శ్రీనివాసరావు మాట్లాడుతూ శిక్షణ లోని అంశాలను క్షేత్ర స్థాయి లో రైతుల వద్దకు తీసుకు వెళ్ళుటకు తదుపరి డివిజన్ స్థాయి, గ్రామ స్థాయి లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమం లో పొలంబడి, మంచి వ్యవసాయ పద్దతులు, ఉద్యాన పంటలు, వరి,పత్తి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు పంటల్లో ఆచరించ వలసిన ఉత్తమ వ్యవసాయ పద్దతులపై అధికారులు, శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉద్యాన అధికారి సత్యనారాయణ రెడ్డి, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డి. భారతి, శాస్త్రవేత్తలు జి. నారాయణస్వామి , తేజేశ్వరరావు, ఉద్యాన అధికారి క్రాంతికుమార్, క్వాలిటీ మేనేజర్ జి. యుగంధర్, రాస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.