ప్రభుత్వం నిషేధించిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వినియోగించవద్దని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కే.రమేష్ వ్యాపారులకు,ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన రమణయ్యపేట మార్కెట్ ను సందర్శించారు. అక్కడక్కడ తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ కవర్లు వినియోగాన్ని గుర్తించారు. వీటిని నిషేధించినా ఎందుకు వినియోగిస్తున్నారంటూ ప్రశ్నించారు. మరోసారి వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రజారోగ్యానికి భంగకరమని వీటిని పూర్తిగా మానివేయాలని సూచించారు.
నాలుగురోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపునకు గురైన ప్రాంతాలలో చాలావరకు సాధారణ పరిస్థితి నెలకొంద న్నారు. వర్షపు నీటిని, అక్కడక్కడా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించామన్నారు. అనేకమంది చెత్తను డ్రైన్ లలో వేయడం వల్ల నీటిపారుదలకు ఆటంకం ఏర్పడుతుందన్నారు. ప్రస్తుత వర్షాల సమయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురైంద న్నారు. ప్రజలు కూడా సహకరించి చెత్తను డ్రైన్లో వేయకుండా పారిశుద్ధ్య సిబ్బందికి మాత్రమే అందజేయాలని కమిషనర్ కోరారు. ఆయన వెంట కార్పొరేషన్ ఆరోగ్యాధికారి డాక్టర్ పృద్వి చరణ్, సానిటరీ ఇన్స్పెక్టర్ ఉన్నారు.