కాకినాడ నగరంలో వేగంగా అనుసంధాన ప్రక్రియ


Ens Balu
13
Kakinada
2022-10-19 14:37:56

ప్రతి ఓటర్ ను ఆధార్ సంఖ్యతో అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎలక్ట్రోరల్ రిజిస్ట్రేషన్ అధికారి కే.రమేష్ కోరారు. బుధవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో ఏ ఈ ఆర్ వో లు, సూపర్వైజరీ అధికారులతో ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అనుసంధాన ప్రక్రియ ఆశించినంత వేగంగా జరగడం లేదన్నారు. ఆధార్ను అనుసంధానం చేయాల్సిన అవసరాన్ని, ప్రయోజనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలని ఆయన అధికారులకు సూచించారు. ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఎన్నికల కమిషన్ ఈ ప్రతిపాదన చేసిందన్నారు. అనుసంధాన  ప్రక్రియను మరింత వేగవంతంచేసి పురోగతి సాధించేలా కృషి చేయాల న్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా  ఆధార్ అనుసంధాన పురోగతిని ఆయన సమీక్షించారు. సమావేశంలో ఏ ఈ ఆర్ వో లు, సూపర్వైజరీ అధికారులు పాల్గొన్నారు.