మంచినీటి పథకాలను పునరుద్దరించండి


Ens Balu
17
Rajamahendravaram
2022-10-19 15:29:44

పెండ్యాల వాటర్ స్కీం కోసం ఏర్పాటు చేసిన  నాలుగు పంపులని పునరుద్ధరించి, ప్రస్తుత సీజన్లో ఆయకట్టు రైతులకు  సాగు నీటిని విడుదల చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత ఆదేశించారు.  బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఇరిగేషన్ అధికారులు పెండ్యాల ఇరిగేషన్ పథకం పంపుల స్థితి గతులపై వాస్తవ పరిస్థితిని  ఇరిగేషన్ అధికారులు కలెక్టరుకు వివరించారు.   విజేశ్వరం పవర్ ప్లాంట్ ప్రస్తుతం నిలుపుదల చేయడంతో పెండ్యాల ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు సరఫరా కావడంలేదని అధికారులు తెలిపారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, పెండ్యాల  ఆయ కట్ట రైతులకు సాగునీటి సమస్య లేకుండా విజేశ్వరం పవర్ ప్లాంట్ కార్యకలాపాలు యధా స్థితి కి వచ్చేంత  వరకు పెండ్యాల పంపింగ్ స్కీము యొక్క పంపుల ద్వారా  కాలువలకు సాగునీరు అందించాలన్నారు. అందుకు అనుగుణంగా వాటికి చేపట్టవలసిన మరమ్మత్తులు, నిర్వహణ పనులను పూర్తి చేసి, సాగు నీరు అందచేసెలా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.  ఈ సమావేశంలో ఇరిగేషన్  ఈ ఈ ఎన్. దక్షిణా మూర్తి,డి ఈ ఈ వి. సత్య దేవ పాల్గొన్నారు.