సచివాలయ పరీక్షలకు 3వ రోజు 76% హాజరు..
Ens Balu
3
విశాఖజిల్లా
2020-09-22 19:09:51
విశాఖపట్నం జిల్లాలో సచివాలయ రాత పరీక్షలకు మంగళవారం 76 % అభ్యర్థులు హాజరయ్యారని జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ చెప్పారు. కలెక్టరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈరోజు పరీక్షలకు 13,374 మంది హాజరు కావలసి వుండగా 10,186 మంది హాజరుకాగా, 3,188 మంది హాజరు కాలేదన్నారు. ఉదయం పరీక్షలకు 8,468 మందికి 6,384 మంది (75 శాతం) హాజరవగా 2,084 మంది హాజరు కాలేదన్నారు. మధ్యాహ్నం పరీక్షలకు 4,906 మందికి 3,802 మంది (77 శాతం) హాజరవగా 1,104 మంది హాజరు కాలేదని వివరించారు. పరీక్షకు హాజరైన అభ్యర్ధులలో కోవిడ్ వచ్చిన వారు ఎవరు లేరన్నారు. కాగా అన్ని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మందులు, మంచినీరు, ఆరోగ్యసిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన వారిని లోనికి అనుమతించామన్నారు. ఇవే నిబంధనలు 26వ తేదీవరకూ అమలు చేస్తామని కలెక్టర్ వివరించారు.