పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి

Ens Balu
9
Kakinada
2022-10-21 07:52:26

శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు అహ‌ర్నిశ‌లూ కృషిచేస్తున్న పోలీసుల సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌ మ‌ని.. విధి నిర్వ‌హ‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన అమ‌ర‌వీరుల త్యాగాలు మ‌రువ‌లేనివ‌ని రాష్ట్ర ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. శుక్ర‌వారం పోలీసు అమ‌రవీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వం సందర్భంగా కాకినాడ‌, పాత జిల్లా పోలీసు కార్యాల‌య ప్రాంగ‌ణంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పోలీసు అమ‌ర‌వీరుల స్తూపం వ‌ద్ద ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీత‌, జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు, ఎమ్మెల్సీ చిక్కాల రామ‌చంద్ర‌రావు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డి, అడిష‌న‌ల్ ఎస్‌పీ పి.శ్రీనివాస్ త‌దిత‌రులు స్తూపం వ‌ద్ద పుష్ప‌గుచ్ఛాలు ఉంచి అమ‌ర‌వీరుల‌కు ఘ‌న నివాళులు అర్పించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ 2021, సెప్టెంబ‌ర్ 1 నుంచి 2022, ఆగ‌స్టు 31 వ‌ర‌కు దేశంలో 264 మంది, రాష్ట్రంలో ఎనిమిది మంది విధి నిర్వ‌హ‌ణ‌లో అసువులు బాసారని.. వారి త్యాగాలు మ‌రువ‌లేనివ‌ని పేర్కొన్నారు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌న్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి రాష్ట్ర పోలీసు శాఖ‌లో విప్లవాత్మ‌క మార్పులకు శ్రీకారంచుట్టార‌ని.. స‌చివాల‌య స్థాయిలో మ‌హిళా పోలీసుల‌ను నియ‌మించిన‌ట్లు తెలిపారు. మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం దిశ యాప్‌ను తీసుకురావ‌డం జ‌రిగింద‌ని.. ఈ యాప్ డౌన్‌లోడ్‌లో కాకినాడ జిల్లా రాష్ట్రంలోనే మొద‌టి స్థానం పొంద‌డం మ‌న‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. దీపావ‌ళి కానుక‌గా ముఖ్య‌మంత్రివ‌ర్యులు 6,511 పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం తెలిపార‌ని.. ఇది చాలా సంతోష‌క‌ర విష‌య‌మ‌న్నారు. శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టంలో పోలీసు యంత్రాంగం కృషిచేస్తోంద‌ని.. గంజాయి వంటి వాటిని అదుపులో పెట్ట‌డంలో జిల్లా పోలీసు యంత్రాంగం మంచి ప‌నితీరు క‌న‌బ‌ర‌చిన‌ట్లు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కోవిడ్ స‌మ‌యంలో అసువులు బాసిన పోలీసుల కుటుంబాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు వెల్ల‌డించారు.

కాకినాడ ఎంపీ వంగా గీత మాట్లాడుతూ 1959, అక్టోబరు 21న ఇండో-టిబెట‌న్ స‌రిహ‌ద్దులో దేశ రక్షణ విధులు నిర్వహిస్తూ చైనా సైనికుల దాడిని వీరోచితంగా ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన  సీఆర్‌పీఎఫ్ పోలీస్ వీరుల త్యాగాల‌ను స్మ‌రించుకుంటూ దేశంలో ఏటా అక్టోబరు 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా నిర్వ‌హించుకుంటున్న‌ట్లు తెలిపారు. పోలీసుల సంక్షేమానికి
రాష్ట్ర ప్ర‌భుత్వం ప్రాధాన్య‌మిస్తోంద‌ని.. చాలా ఏళ్లుగా పోలీసు అమ‌ర‌వీరుల కుటుంబాల ఇళ్ల స్థ‌లాల ద‌ర‌ఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయ‌ని.. నేడు జిల్లా క‌లెక్ట‌ర్‌, ఎస్‌పీల కృషితో ఆ ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించి ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల‌ను పంపిణీ చేయ‌డం ఆనందించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. 

జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా మాట్లాడుతూ పోలీసు అమ‌ర‌వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్ర‌భుత్వం అన్ని చ‌ర్య‌లూ తీసుకుంటున్న‌ట్లు తెలిపారు. అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాల‌ను నేడు పంపిణీ చేయ‌డం జ‌రిగింద‌ని.. ఇళ్ల నిర్మాణాల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయాన్ని అందించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎన్నో సవాళ్లు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ పోలీసులు  శాంతి భద్రతలను కాపాడటం వల్లే దేశ ప్రజలు నిశ్చింతగా, నిర్భయంతో జీవిస్తున్నార‌ని.. స‌మాజం ప్రగతి బాటలో పయనిస్తోంద‌ని పేర్కొన్నారు.  పోలీస్ శాఖ రేయింబవళ్లు చేస్తున్న ఈ కృషికి  ప్రజలందరూ తప్పని సరిగా సహకారం అందించాల‌ని ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ పిలుపునిచ్చారు.

ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు మాట్లాడుతూ అసాంఘిక శక్తులను అరికట్టేందుకు పోలీసులు  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నార‌ని, వారి సేవ‌లు చాలా గొప్ప‌వ‌ని పేర్కొన్నారు. పట్టుదల, ఓర్పు, సహనం, సాహసం, త్యాగాలకు మారుపేరుగా పోలీస్ దళాలు నిలుస్తున్నాయ‌ని అన్నారు. కార్య‌క్ర‌మంలో భాగంగా అమ‌ర‌వీరుల కుటుంబాల‌కు ఆర్థిక స‌హ‌కారంతో పాటు ఇళ్ల స్థ‌లాల ప‌ట్టాలను మంత్రి దాడిశెట్టి రాజా, ఎంపీ వంగా గీత‌, క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, ఎస్‌పీ ఎం.ర‌వీంద్ర‌నాథ్‌బాబు.. ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారుల‌తో క‌లిసి అంద‌జేశారు. కార్య‌క్ర‌మంలో కాకినాడ ఆర్‌డీవో బీవీ ర‌మ‌ణ‌, డీఎస్‌పీ భీమారావు, పోలీసు, వివిధ శాఖ‌ల అధికారులు, సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.