పోలీసు అమరవీరుల త్యాగం శ్లాఘనీయం


Ens Balu
13
Parvathipuram
2022-10-21 09:04:57

విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీసు అమరుల త్యాగాలు, సేవలు శ్లాఘనీయమని ఇంచార్జ్ కలెక్టర్, జెసి ఓ.ఆనంద్, జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ వి. విద్యాసాగర్ నాయుడు కొనియాడారు . పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా శుక్రవారం  ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన అమరవీరుల స్ధూపం వద్ద స్మృతి పరేడ్‌ నిర్వహించారు. పోలీసుల గౌరవ వందనాన్ని వారు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్.పి మాట్లాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకుంటూ పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించుకుంటామన్నారు. విధి నిర్వహణలో అసువులు బాసిన పోలీసులను స్మరించుకోవడం మన బాధ్యత అన్నారు. ప్రజల ధన, మాన, ఆస్తుల పరిరక్షణ, శాంతి భ్రతలను కాపాడడంలో సవాళ్ళను ఎదుర్కొని పోలీస్ శాఖ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఐదుగురు పోలీసులు అమరత్వం పొందారుని వారి సేవలు మరువలేనివని పేర్కొన్నారు. విధి నిర్వహణలో వారు చూపించిన ధైర్య సాహసాలు, నిబద్ధత ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. 

జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ త్యాగాలను స్మరణం చేసుకోవడం కోసం ప్రతి ఏటా ఈ రోజున పోలీసు అమర వీరుల సంస్మరణ జరుపుకొని పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం అందరి బాధ్యత అన్నారు. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేమన్నారు. శాంతి భద్రతల కట్టడిలో పోలీస్‌ వ్యవస్థ చాలా కీలకంగా పనిచేస్తుందన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పోలీసులు పోలీసులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధులు నిర్వహించారన్నారు. సమాజం ఎప్పుడూగుర్తుంచుకుంటుందన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లాలో అమరత్వం పొందిన ఎం. గాంధీ, ఎస్ .సూర్యనారాయణ, సిహెచ్ .చిరంజీవిలు, బి. శ్రీరాములు లకు శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులర్పించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అమరులైన పోలీసు కుటుంబ సభ్యులకు నగదు చెక్ లను జాయింట్ కలెక్టర్, ఎస్ పి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఓ. దిలీప్ కుమార్, ఐటీడీఏ పీవో సి. విష్ణు చరణ్, డి.ఎస్.పి సుభాష్, అమరులైన పోలీసు కుటుంబ సభ్యులు మనోరంజన్ , ఎస్ .రాజు, బి.ప్రమీల, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.