ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే పట్టభద్రుల సత్తా ఏంటో చూపించాలి..!


Ens Balu
30
Visakhapatnam
2022-10-22 01:57:38

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటు యొక్క సత్తాచూపించాలంటే ప్రతీ ఒక్క పట్టభద్రుడు ఖచ్చితంగా ఓటరుగా నమోదు కావాలని అల్లూరి చరిత్రపరిశోధకులు, ఈఎన్ఎస్ నేషన్ న్యూస్ ఏజెన్సీ సంపాదకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) పిలుపునిచ్చారు. ఈ మేరకు శనివారం ఆయన విశాఖలో మీడియాకి ప్రకటన విడుదల చేశారు. ఉత్తరాంధ్రా లోని ఆరు(అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం) జిల్లాలు జిల్లాల్లోని ప్రతీ పట్టభద్రుడు ఓటు నమోదు చేయించుకోవాలన్నారు. అవకాశం లేనివారు ఆన్ లైన్ లోనైనా నమోదు చేయించుకోవాలన్నారు. శాసన మండలికి నిజమైన ప్రజాప్రతినిధిని, ప్రజలు, నిరుద్యోగ యువత భవిత కోసం పోరాటం చేసే మంచి వ్యక్తులును పంపాలంటే అది ఒక్క ఓటుతోనే సాధ్యపడుతుందని పేర్కొన్నారు. అన్ని తహశీల్దార్ కార్యాలయాల్లోనూ పట్టభద్రులు గెజిడెట్ అటెస్టేషన్ చేయించిన డిగ్రీ ప్రొవిజినల్, ఓటు గుర్తింపుకార్డు జెరాక్సులు, ఫారం-18ను తప్పులు లేకుండా పూర్తిచేసి, ఓటు నమోదుకి దరఖాస్తులు సమర్పించాల్సి వుంటుందన్నారు.

 ప్రతీ పట్టభద్రుడూ తనవంతు భాద్యతగా తాము ఓటు నమోదు చేసుకోవడంతోపాటు, సహచర పట్టభద్రులతో కూడా ఓటు నమోదు చేయించాలని సూచించారు. ఎక్కువ మంది పట్టభద్రులు ఓటరుగా నమోదు కావడం వలన, అనుకున్న మంచి వ్యక్తులను ఎమ్మెల్సీని చేసుకోవడానికి వీలుపడుతుందని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ మంది తమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్లను నమోదుచేసుకొని ఓటరు యొక్కత సత్తాను తెలియజేయాలని అల్లూరి చరిత్రపరిశోధకులు, ఈఎన్ఎస్ నేషన్ న్యూస్ ఏజెన్సీ సంపాదకులు పి.బాలభాను(ఈఎన్ఎస్ బాలు) మీడియాకి విడుదలచేసిన ప్రకనటలో పేర్కొన్నారు.