శ్రీకాకుళం జిల్లాలో 3వ రోజు 75% హాజరు..
Ens Balu
3
Srikakulam
2020-09-22 19:43:45
శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం జరిగిన గ్రామ/వార్డు సచివాలయ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. జిల్లాలో ఉదయం 13 కేంద్రాలలోను, రెండవ పూట (మధ్యాహ్నం ) 9 కేంద్రాలలోను సచివాలయ ప్రవేశ పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. ఉదయం జరిగిన పరీక్షలకు 72 శాతం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 75 శాతం మంది అభ్యర్ధులు హాజరైనట్లు తెలిపారు. రెండవ పూట 1434 మంది అభ్యర్ధులకు గాను 1071 మంది అభ్యర్ధులు హాజరైనారని, 363 మంది అభ్యర్ధులు గైర్హాజరైనారని తెలియచేసినారు. ఉదయం ఇద్దరు కరోనా పేషెంట్లు, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు ఒక కోవిడ్ పేషెంట్ హాజరైనట్లు తెలిపారు.కాగా అన్ని పరీక్షా కేంద్రాల్లో అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మందులు, మంచినీరు, ఆరోగ్యసిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించిన వారిని లోనికి అనుమతించామన్నారు. ఇవే నిబంధనలు 26వ తేదీవరకూ అమలు చేస్తామని కలెక్టర్ వివరించారు.