నవంబర్ 7లోగా ఓటరుగా నమోదుకావాలి..


Ens Balu
24
అల్లూరి సీతారామరాజు జిల్లా
2022-10-30 14:27:56

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని పట్టభధ్రులందరూ ఓటరుగా నమోదుకావాలని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లాలో అధిక సంఖ్యలో పట్టభద్రులు ఉన్నప్పటికీ ఓటరు నమోదు తక్కువగా ఉందన్నారు. గత ఓటరు జాబితాలో పేరు ఉందనే భ్రమలో ఉండవద్దని, ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటరుగా నమోదుకావలసిన అవసరం ఉందని చెప్పారు. కావున జిల్లాలో డిగ్రీ పొందిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు. పట్టభద్రులు ఫారం -18 సమర్పించి ఓటరుగా నమోదుకావచ్చని, తమ సమీప తహసీల్దార్లకు ఓటరు నమోదు ఫారాలను అందజేయవచ్చని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటరుగా నమోదు అయ్యేందుకు నవంబర్ 7వ తేదీ వరకు అవకాశం ఉందని, కావున ఈలోగా  ఫారం-18లను సమర్పించి ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ వివరించారు.