ఈ నెల 26న వర్చువల్ లోక్ అదాలత్..
Ens Balu
3
Srikakulam
2020-09-22 20:01:12
శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 26 వ తేదీన వర్చ్యువల్ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్ధ అధ్యక్షులు జి.రామకృ ష్ణ తెలిపారు. మంగళవారం జిల్లా జడ్జి ఛాంబరులో వర్చువల్ లోక్ అదాలత్ నిర్వహణపై సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలకు సత్వర న్యాయాన్ని అందించు నిమిత్తం కరోనా నేపథ్యంలో న్యాయ సేవాధికార సంస్ధ వర్చ్యువల్ (వీడియో కాన్ఫరెన్సు) ద్వారా లోక్ అదాలత్ నిర్వహించ వలసినదిగా హైకోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. కావున హైకోర్టు ఆదేశాలను అనుసరించి, ఈ నెల 26 న జిల్లా లోని అన్ని కోర్టులలోను వీడియో కాన్ఫరెన్సు ద్వారా లోక్ అదాలత్ ను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆ రోజు ఉదయం 10.30 గం.ల నుండి లోక్ అదాలత్ ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు. రాజీపడదగ్గ క్రిమినల్ కేసులు, సెక్షన్ 138 నెగోషియబుల్ ఇనుస్ట్రమెంట్స్ యాక్టు కేసులు, మోటారు యాక్సిడెంటు క్లెయిమ్ కేసులు, ఫ్యామిలీ కోర్టు కేసులు, లేబర్ కేసులు, ప్రభుత్వ భూసేకరణ కేసులు, బ్యాంక్ కేసులు, సివిల్ కేసులు, రెవిన్యూ కేసులు, ఇతర రెవిన్యూ కేసులు, సర్వీస్ మేటర్సు, పాత పెండింగ్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు, రాజీ మార్గం ద్వారా పరిష్కరించు కోవచ్చునని తెలిపారు. జిల్లా కోర్టు మరియు జిల్లాలోని ఇతర కోర్టులలోని న్యాయ సేవాధికార సంస్ధ వారు వర్చువల్ ద్వారా కేసులను రాజీచేయడం ద్వారా పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కక్షిదారులు సంబంధిత కోర్టులకు తమ కేసులను మెయిల్ చేసుకోవలసి వుంటుందని, ఇరు పార్టీల కక్షిదారులు ఇంటి నుండే తమ కేసులను పరిష్కరించుకునేందుకు ఈ అవకాశాన్ని కలిగించడం జరిగిందని తెలిపారు. జిల్లా కోర్టు మొయిల్ ఐ.డి. dlsasklm@gmail.com