గోకుల్ పార్కును ప్రారంభించిన విశాఖ మేయర్


Ens Balu
18
Visakhapatnam
2022-11-07 16:05:17

కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజల సందర్శనార్ధం గోకుల్ పార్కును ఆధునీకరించామని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె ఆర్కే బీచ్ లోని గోకుల్ పార్కు ను సుమారు రూ.30.50 లక్షలతో ఆధునీకరించిన పనులకు జివిఎంసి కమిషనర్ పి రాజాబాబు, ఎం ఎల్ సి వంశీ కృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ కార్తీక మాసంలో ఎంతో మంది భక్తులు బీచ్ లో గోకుల్ పార్కులోని శ్రీ కృష్ణ మందిరాన్ని సందర్శిస్తారని వారికి సౌకర్యాల కల్పనకు గోకుల్ పార్కును సుమారు రూ.30.50 లక్షలతో శ్రీ కృష్ణ ని  పిల్లని గ్రోవితో ఆర్చ్, బనియన్ ట్రీతో రాధా కృష్ణులకు నీడ, సందర్శకులకు కూర్చునేందుకు సిమెంటు బెంచీలు, బీచ్ వైపు ఉన్న పిల్లర్సు మరమ్మత్తులు, పెయింటింగ్, ఫ్లోరింగ్, విద్యుత్ మొదలైన పనులను ఆధునీకరించాలని తెలిపారు.

అనంతరం జివిఎంసి కమిషనర్ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజున బీచ్ కు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉన్న దృష్ట్యా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుధ్యం, మరుగుదొడ్లు మొదలైనవి ఏర్పటుచేసారన్నారు. సందర్శనానికి వచ్చే భక్తులు వారి వెంట తెచ్చుకున్న ఆహార పదార్ధాలు, పూజా సామాగ్రిల యొక్క వ్యర్ధాలను, అక్కడ ఏర్పాటు చేసిన డస్ట్ బిన్లలో వేయాలని ఈ సందర్భంగా సూచించారు. అలాగే నగర పరిశుభ్రతకు బీచ్ లో నిషేధిత ప్లాస్టిక్ ను వాడరాదని, ప్రత్యామ్నాయ వస్తువులనే వాడాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు పిన్నింటి వరలక్ష్మి, పల్లా శ్రీను, కార్పొరేటర్ ఊరుకూటి నారాయణ రావు, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఒమ్మి సన్యాసి రావు, మాజీ అధ్యక్షులు  భరణికానా రామారావు, ప్రధాన కార్యదర్శి మొల్లి అప్పారావు, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు గోలగాని శ్రీనివాస్, జోనల్ కమిషనర్ చక్రవర్తి, పర్యవేక్షక ఇంజినీరు వేణు గోపాల్, కార్యనిర్వాహక ఇంజినీరు, ఉప కార్యనిర్వాహక ఇంజినీరు, సహాయక ఇంజినీరు, శానిటరీ సూపర్వైజర్, శానిటరీ ఇన్స్పెక్టర్, జిల్లా యాదవ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.