రాజమండ్రిలో రైలు బోగీ పడిపోవడంతో నిర్ణీత సమయానికి వెళ్లవలసిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ 2గంటలు ఆలస్యంగా నడుస్తుందని అన్నవరంలోని రైల్వే సిబ్బంది తెలియజేశారు. వాస్తవానికి అన్నవరం ఈ రైలు ఉదయం 8.5గంటలకు రావాల్సి ఉంది. అదే విధంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలుని రద్దుచేసినట్టు కూడా రైల్వే అధికారులు ప్రకటించారు.ఈ రైలు సమాచారాన్ని గమనించాలని సూచిస్తున్నారు. కాగా ఈ సమాచారం ఈరోజువరకూ మాత్రమేనని ప్రకటించారు.