కలియుగ ప్రత్యక్షదైవం, ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆలయ మర్యాదలతో ప్రధాన కార్యదర్శి దంపతులకు మంగళ వాయిద్యాలు,పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి వేదమంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులకు తీర్ధ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు. తదుపరి ఆలయ అనివేటి మండపంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ స్వామి వారి చిత్రపటాన్ని ప్రధాన కార్యదర్శికి అందజేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్య ప్రకాష్ స్వామి వారి విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి.ఆర్.రాధిక, సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, పలాస రెవెన్యూ డివిజనల్ అధికారి టి.సీతారామమూర్తి, దేవాదాయ శాఖ సహాయ కమీషనర్ డి.వి.వి.ప్రసాదరావు, కార్యనిర్వహణాధికారి వి.హరిసూర్య ప్రకాష్, తహసీల్దార్ కె.వెంకటరావు, ఆలయ పాలకమండలి సభ్యులు అంధవరపు రఘురామ్, మండవిల్లి రవి, ఆలయ అర్చకులు, సిబ్బంది, వడ్డి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.