శాస్త్ర విజ్ఞాన ఫలాలను హక్కుగా అందివ్వాలి..


Ens Balu
12
Kakinada
2022-11-13 11:10:07

సామాన్య ప్రజానీకానికి శాస్త్ర విజ్ఞాన ఫలాలను హక్కుగా అందివ్వాలని, దీనికి ఎదురవుతున్న అశాస్త్రీయ భావజాల ఆధి పత్య ధోరణులను ప్రజాసైన్సు కార్యకర్తలు ఎదుర్కోవాలని జనవిజ్ఞానవేదిక రాష్ట్ర ప్లీనరీ రెండవ రోజు సభలో మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ పిలుపునిచ్చారు. జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర ప్లీనరీ సభల 2వ రోజైన ఆదివారం జే ఎన్ టి యు హాలులో జరిగిన సభకు రాష్ట్ర జి.వి.వే. అధ్యక్షులు రాజశేఖర్ రాహుల్ అధ్యక్షత వహించారు.  కోవిడ్-19 వంటి మహమ్మారిని ఎదుర్కోవటంతో సైన్సు మాత్రమే పరిష్కారం చూపగలిగిందని, వేక్సిన్  ఉత్పత్తిలో సైన్సు కీలక పాత్రవహించిందని  శర్మ అన్నారు. భావజాల రంగంలో ప్రశ్నించే తత్వాన్ని, ప్రజాస్వామ్య కాంక్షని  విద్యార్థి దశ నుంచే అభివృద్ధి చేయాలన్నారు. కొందరు కుహనా మేధావులు మాఢ నమ్మ కాలను పనిగట్టుకొని ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ప్రజల కోసం సైన్సు, ప్రగతికోసం సైన్సు, ప్రపంచశాంతి కోసం సైన్సు అనే నినాదాలతో జనవిజ్ఞాన వేదిక కార్యకర్తలు ప్రజా సైన్సు ఉద్యమానికి పునరంకితం కావాలని శర్మ అన్నారు. ఈ సభలో ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎంఎల్సీ వెంకటేశ్వర రావు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర గౌరవాద్యక్షులు డాక్టర్ సి.స్టాలిన్ రాష్ట్రపూర్వ అధ్యక్షులు డాక్టర్ చల్లా రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి  రాధారాణి, కాకినాడ జిల్లా జ.వి.వే. అధ్యక్షులు కె.ఎం.ఎం.ఆర్.ప్రసాద్  
కార్యదర్శి  రామారావు తదితరులు పాల్గొన్నారు. 

ఆకట్టుకొన్న కర్రసాము విన్యాసం :-
 నీలపల్లి జెడ్.పి. హైస్కూల్ విద్యార్థులు ఎం.భార్గవి, ఐ.జాహ్నవి, పి. సుశాంత్ లు చేసిన కర్రసాము విన్యాస ప్రేక్షకులను అలరించింది. జ.వి.వేదిక సమతా విభాగం జిల్లా కన్వీనర్ శ్రీమతి మంగతాయురు దర్శకత్వంలో రూపొందించిన సావిత్రీ భాయి ఫూలే కళారూపం అందరినీ  ఆకట్టుకొంది.