త్రాగునీటి పనులు సత్వరం పూర్తిచేయాలి..
Ens Balu
2
Madhavadhara
2020-09-22 20:22:12
జివిఎంసీ పరిధిలో చేపడుతున్న తాగు నీటి సరఫరా ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేయాలని జి.వి.ఎం.సి. కమిషనర్ డా. జి. సృజన అధికారులను ఆదేశించారు. మంగళవారం మాధవధార ప్రాంతంలో ఆసియా అభివృద్ది బ్యాంకు(ఏ.డి.బి) నిధులు రూ.385.66కోట్లతో చేపట్టిన 24x7 మంచి నీటి సరఫరా పధకము పనులను కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పాజెక్టు పురోగతి గురుంచి గుత్తేదారు సంస్థ ఎన్.సి.సి. వారి తరుపున జనరల్ మేనేజర్ జయశంక ర్,అసిస్టెం ట్ జనరల్ మేనేజర్ అవినాష్ కుమార్ పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా జి.వి.ఎం.సి. కమిషనర్ నకు తెలియజేసారు. ప్రాజెక్టు కు సంబందించిన పైపు లైను, రిజర్వాయర్లు, ఇంటి కుళాయి కనక్షన్ల పనితీరుపై జి.వి.ఎం.సి. పర్యవేక్షక ఇంజినీరు కె.వి.ఎన్. రవిని అడిగి తెలుసుకున్నారు. 24x7 ప్రాజెక్టు రియల్ టైమును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పద్మనాభపురం పైపె లైన్ నకు సంబందించి కోర్టు వాజ్యముపై సింహాచలం దేవస్థానం ఇ.ఓ. తో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు. భవనాలపై అమర్చనున్న కాన్సెంట్రేటర్స్ కు సంబందించిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఏ.డి.బి ప్రాజెక్టులకు రావలసిన నిధులపై చర్చించి విడుదలకు కృషి చేస్తామన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తీ అయిన ప్రాంతాలలో రహదారి పనులను వెంటనే మొదలుపెట్టాలని కాంట్రాక్టరులను ఆదేశించారు. ప్రాజెక్టులో భాగంగా అమర్చిన ఏ.ఎం.ఐ. మీటర్లు, డి.ఎం.ఏ. ఆర్.టి.వి. పేనల్ పనితీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షక ఇంజినీరు కె.వి.ఎన్. రవి, ఏ. ఇ. రామనాయుడు, ఎన్.సి.సి. జనరల్ మేనేజర్ జయశంకర్ మరియు అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.