ఇటీవల ప్రభుత్వ నిబంధనల మేరకు మెర్జ్ చేసిన అంగన్వాడీ కేంద్రాలలో సూపర్వైజర్ పోస్ట్ లను సర్దుబాటు ద్వారా తాత్కాలికంగా నియమించినట్లు జిల్లా కలెక్టర్ సూర్య కుమారి ఒక ప్రకటన లో తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, విజయనగరం జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహించిన తాత్కాలిక సూపర్వైజర్ గ్రేడ్ 2 నియామకాలు నవంబర్ 1వ తేదిన వెలువడినప్రభుత్వ ఉత్తర్వులు మేరకు నియమ,నిబంధనలను అనుసరిoచి ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల విధులకు ఆటంకం లేకుండా మెర్జెడ్ అంగన్వాడి సెంటర్ లో
పనిచేయుచున్న అంగన్వాడి కార్యకర్తలలో ఉన్నత విద్యఅర్హత ప్రాతిపదికన ఎంపిక చేపట్టడం జరిగిందని తెలిపారు. మెర్జెడ్ అంగన్వాడి సెంటర్ నందుకార్యకర్తలను తీసుకోవటం వల్ల అంగన్వాడి కేంద్రం విధులకు ఒకరు సెక్టార్ ఇన్ ఛార్జ్ యాక్టింగ్ సూపర్వైజర్ , ప్రస్తుత నియామకం తాత్కాలిక నియామకం మాత్రమేనని తెలిపారు. సదరు తాత్కాలిక బాధ్యతలు సూపర్వైజర్ గా నివర్తిస్తున్న వారికి 5000 రూపాయలు ఎలెవన్స రూపంలో చెల్లిస్తారన్నారు.