మంచి పుస్తకాలు మనిషి జీవితంలో గొప్ప మార్పును తీసుకువస్తాయని రాష్ట్ర పరిశ్రమల,పెట్టుబడులు – ప్రాధమిక వసతులు, వాణిజ్యం,ఐటీ శాఖా మంత్రి గుడివాడ అమర్ నాధ్ పేర్కొన్నారు. ప్రతీఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని కోరారు. సోమవారం ఉదయం 55వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకొని స్థానిక విఎమ్ఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జునతో కలిసి ఆయన పుస్తక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగాఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ పిల్లలకు చదువుతోపాటు సమాజం పట్ల అవగాహన అవసరమని అన్నారు. గొప్పగొప్ప రచయితల రచనల ద్వారా సమాజం పట్ల, వివిధ అంశాల పట్ల అవగాహన పెంచుకోవచ్చునని అన్నారు. పుస్తకాలు సమాజంలో ఎన్నో మార్పులకు దోహదం చేశాయని పేర్కొన్నారు. పుస్తక పఠనం ప్రతీఒక్కరికీ అవసరమని, మంచి పుస్తకాలను అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలని కోరారు. జిల్లా గ్రంథాలయంలో ఎన్నో విలువైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రంథాలయాల్లో మరిన్ని మౌలిక వసతులను కల్పించి మంచి పుస్తకాలను అందుబాటులో ఉంచుతామని చెప్పారు.
జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున మాట్లాడుతూ దేశమంతా పిల్లలు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. గ్రంధాలయల యొక్క ప్రాముఖ్యతను పిల్లలకు చేరేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు . బాలల కోసం గ్రంధాలయ వారోత్సవాలు జరపడం మంచి శుభ పరిణామన్నారు. మన దగ్గర ఉన్న పుస్తకాలే కాకుండా గ్రంధాలయంలో ఉండే పుస్తకాలను కూడా పఠనం చేయాలన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ కొండా రమాదేవి మాట్లాడుతూ సమాజ వికాశంలో గ్రంథాలయాల ప్రాధాన్యతను తెలియజేసేందుకు గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పిల్లలు టీవీలు, ఫోన్ లకు పరిమితం కాకుండా పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు. పెద్దవారు కూడా పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవడమే కాకుండా పిల్లల్లో పుస్తక పఠనాన్ని ప్రోత్సహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి, డిఇఓ చంద్రకళ, వివిధ కార్పొరేషన్ చెర్మన్ లు, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు గ్రంథాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.