అనకాపల్లిజిల్లాలో కుమ్మరి శాలివాహనుల సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర కుమ్మరి శాలివాహన సంఘ చైర్మన్ ఎమ్.పురుషోత్తం తెలిపారు. సోమవారం డైరెక్టర్ డి.ఏ. వెంకటరావు ఇతర సభ్యులతో కలసి జిల్లా కలెక్టర్ రవి పట్టన్ శెట్టి కి విజ్ఞాపన పత్రం అందజేశారు. దీనిపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్తగా నియమింప బడిన సంఘ సభ్యులు కొత్తూరు జయమ్మ (తీడ గ్రామము), శ్రీకాకులపు జగదీశ్వరరావు (నరసయ్యపేట)కొత్తూరు త్రిమూర్తులు (దేవరాపల్లి), మునగపాక గోవింద (యలమంచిలి) బాధ్యతలు స్వీకరించారు. అనంతరం బీసీ సంక్షేమ అధికారి కే.రాజేశ్వరి సంఘ సమావేశం నిర్వహించారు. చైర్మన్, డైరెక్టర్ సభ్యులు జిల్లాలో కుమ్మరి శాలివాహనలకు సమస్యలపై చర్చించారు.