మహాదీపోత్సవం వేదికను పరిశీలించిన టిటిడి జెఈఓ


Ens Balu
10
Visakhapatnam
2022-11-14 14:10:30

విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ వద్ద కార్తీక మహాదీపోత్సవం వేదికను టిటిడి జెఈఓ సదా భార్గవి సోమవారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా జెఈఓ మీడియాతో మాట్లాడుతూ టిటిడిలోని ఇంజినీరింగ్, ఎస్వీబీసీ, ప్రజా సంబంధాలు, శ్రీవారి సేవ, నిఘా, భద్రత, ఉద్యానవన, ఆరోగ్య, అన్నమాచార్య ప్రాజెక్టు, ఆలయం తదితర విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసే శోభాయమానంగా వేదికను ఏర్పాటు చేశారని చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు యతివందనంతో కార్యక్రమం మొదలవుతుందని, 
రాత్రి 8.30 గంటలకు ముగుస్తుందని తెలియజేశారు. ఇందులో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు  వైవి సుబ్బారెడ్డి సందేశం, విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి అనుగ్రహ భాషణం, సంగీత, నృత్య కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని తెలిపారు. భక్తులు సంప్రదాయ వస్త్రధారణలో వచ్చి  శ్రీ వేంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. 

టిటిడి సివిఎస్వో  నరసింహ కిషోర్ మాట్లాడుతూ స్థానిక పోలీసుల సహకారంతో దీపోత్సవానికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టామన్నారు. భక్తులకు సేవలందించేందుకు 1000 మంది శ్రీవారి సేవకులు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా సౌండ్ సిస్టం, ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశామని వివరించారు. ప్రత్యేక ఆకర్షణగా సైకత  శ్రీవారి శంఖుచక్రాలు వేదిక వద్ద  జగదీష్ ఆధ్వర్యంలోని ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఇసుకతో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర స్వామివారి శంకు చక్ర నామాలు ప్రత్యేక 
ఆకర్షణగా నిలుస్తున్నాయి.

 జెఈఓ వెంట ఎస్వీబీసీ సీఈవో  షణ్ముఖ్ కుమార్, దాతలు రాజేష్,  హిమాంశుప్రసాద్,  కృష్ణప్రసాద్, టిటిడి 
ఎస్ఇ-2  జగదీశ్వర్ రెడ్డి, పిఆర్ఓ డా.టి.రవి, డిఇ  రవిశంకర్ రెడ్డి, డిఎఫ్ఓ  శ్రీనివాస్, విజివో  మనోహర్ తదితరులు ఉన్నారు.