పాండ్రంగి వంతెనకు రూ.14 కోట్లు ..
Ens Balu
3
Visakhapatnam
2020-09-22 20:29:08
విశాఖజిల్లాలోని పాండ్రంగి వంతెన నిర్మించడం వలన చుట్టు ప్రక్కల గ్రామాల అభివృద్థి చెందుతాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు వెల్లడించారు. భీమిలి శాసన సభ నియోజక వర్గంలో పద్మనాభం మండలంలోని స్వర్గీయ అల్లూరి సీతారామరాజు జన్మించిన పాండ్రంగి వద్ద గోస్తనీ నదిపై వంతెన నిర్మిస్తే చుట్టు ప్రక్కల గ్రామాలు అభివృద్థి చెందుతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి మరియు భీమిలి శాసన సభ సభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరా వు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డికి లేఖ ద్వారా తెలియజేయగా రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణమే స్పందించే పాండ్రంగి వద్ద గోస్తనీ నదిపై వంతెన నిర్మాణానికి 14 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ళ నుండి ఈ సమస్య నలుగుతున్నది కాని పాండ్రంగి వంతెన సమస్య పరిష్కారం కావడం లేదని, ముఖ్యమంత్రికి లేఖ వ్రాసిన వెంటనే తక్షణమే స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి నియోజక వర్గ ప్రజల తరఫున ఆయన కృజ్ఞతలు తెలిపారు. వంతెన నిర్మాణానికి 14 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేయడం పట్ల పద్మనాభం ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.