వివాదాలకు తావు లేకుండా పక్కాగా భూముల రీసర్వే


Ens Balu
29
Paderu
2022-11-15 10:53:51

వివాదాలకు తావులేకుండా రీ సర్వే ప్రక్రియ పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అదేశించారు. మంగళవారం కలెక్టర్ పాడేరు కార్యాలయం సమావేశమందిరంలో రీసర్వే పై మండల సర్వేర్లు, గ్రామ సర్వేయర్లుతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వే ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎటువంటి సమస్యలు లేకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. వెక్టరైజేషన్ సక్రమంగా జరగాలని స్పష్టం చేశారు. మండల సర్వేయర్లు, తాసిల్దార్లు భూమి మీదకు వెళ్లి 
అభ్యంతరాలను పరిశీలించాలని అన్నారు. సర్వేయర్లు ఎఫ్ఎంబిని దగ్గర ఉంచుకుని రీ సర్వే చేయాలన్నారు. ఎఫ్ఎంబి పై సర్వేయర్లకు, రెవెన్యూ అధికారులకు అవగాహన ఉండాలన్నారు. ముసాయిదా ల్యాండ్ రిజిస్టర్ లో చెందిన వారి పేర్లు, జాయింట్ పట్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వీఆర్వోలు, గ్రామ సర్వేయర్లు, మండల సర్వేయర్లు, కలెక్టరేట్ ల్యాబ్ లో వెక్ట్రైజేషన్ చేయాలని చెప్పారు. రీసర్వే డేటాను నాణ్యతలు పరిశీలించి తహసిల్దార్ లాగిన్ నుండి ఆర్డీవో లాగిన్ కి పంపించాలని అన్నారు. రెవెన్యూ అధికారులు మ్యుటేషన్ వేగవంతం చేయాలని చెప్పారు.ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ జె. శివ శ్రీనివాసు, ఆర్డీవో బి. దయానిధి, సర్వే సహాయ సంచాలకులు వై .మోహన్ రావు , మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.