ప్రజారోగ్యం కోసం..ఉచిత మందులు


Ens Balu
3
సిఐటియు కార్యాలయం
2020-09-22 20:48:45

అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో సిఐటియు జగదాంబ కార్యాలయంలో ఆన్‌లైన్‌ ‌ద్వారా ఉచిత వైద్య సలహాలు మరియు ఉచిత మందులు పంపిణీ కార్యక్రమాన్ని విశాఖ జిల్లా మాజీ వైద్యాశాఖ అధికారి పెంటకోట రామారావు ఆన్‌లైన్‌ ‌ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర ప్రధాన క్యాదర్శి  టి.కామేశ్వరరావు  అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అల్లూరి విజ్ఞాన కేంద్రం కార్యదర్శి డాక్టర్‌ ‌బి.గంగారావు మాట్లాడుతూ కరోనా కాలంలో ఉచితంగా వివిధ మండలాలకు మందులు కిట్స్ ‌పంపిణీ చేశామని, భవిష్యత్‌లో మరిన్ని మెడికల్‌ ‌క్యాంపులు నిర్వహిస్తామని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఏరియా ప్రజలకు దగ్గు, ఒళ్లునొప్పులు, జలుబు, పడిశం జబ్బులకు మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఆరోగ్య పరిరక్షణ వేదిక నాయకులు చంద్రమౌళి, శ్రవంత్‌, ఎం.‌సంజయ్‌కుమార్‌, అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రం సభ్యులు ఎంఆర్‌డి రాజు, ఇంజనీర్‌ ఆర్‌.‌కిరణ్‌, ఐద్వా నగర నాయకులు ఆర్‌ఎన్‌ ‌మాధవి, సిఐటియు నాయకులు బి.జగన్‌, ఎం.‌సుబ్బారావు, నర్సులు కావ్యశ్రీ, లిఖిత, శిరిష తదితరులు పాల్గొన్నారు.