నాడు-నేడు పాఠశాలల్లో మౌలిక వసతుల పనులు వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. బుధవారం భీమవరం కలెక్టర్ కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి మండల స్థాయి అధికారులతో నాడు-నేడు పనుల , ఆధార్ అప్డేషన్ , ఏపీ సేవ సర్వీసులు గృహ నిర్మాణం , జగనన్న స్పోర్ట్స్ క్లబ్బులు, అమూల్ పాల కేంద్రాల ప్రారంభం పై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అందుబాటులో ఉన్న నిధులను సక్రమంగా వినియోగించి ప్రణాళికబద్ధంగా పనులను పూర్తి చేయాలన్నారు. నాడు-నేడు కింద చేపట్టిన పనులకు సంబంధించి పాఠశాలలు, కళాశాలలో ఏ ఏ నిర్మాణాలు చేపడుతున్నారో అన్ని పనులకు ఒకేసారి జరగాలని ఆమె ఆదేశించారు. ఎక్స్పెండిచర్ కూడా బుక్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదనపు గదులు నిర్మాణం ,కాంపౌండ్ వాల్స్, టాయిలెట్స్ , డ్రింకింగ్ వాటర్ తదితర పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు . నాడు నేడు పనులకు ఇసుక కొరత లేదని అన్ని పనులు ఒ ఒకేసారి ప్రారంభించి పనులు కొనసాగించాలని కలెక్టర్ ఆదేశించారు.
ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును విధిగా అప్డేట్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆధార్ కార్డు పొంది పది సంవత్సరాలు పూర్తి అయిన ప్రతి ఒక్కరు అడ్రస్ తదితర వాటిని ఆప్ డేట్ చేసుకోవాలని ఆమె అన్నారు . పిల్లల ఆధార్ కూడా అప్డేట్ చేయాలని కలెక్టర్ అన్నారు. ఈ నెల 18 ,19 తేదీలలో ప్రత్యేక ఆధార్ నమోదు, అప్డేషన్ క్యాంప్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వచ్చిన సమస్యలు , దరఖాస్తులు త్యారిత గతిన పరిష్కరించాలని కలెక్టర్ అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గుర్తించిన పనుల లకు అంచనాలు తయారు చేసి పంపించాలని ,మంజూరు చేసిన వెంటనే పనులు ప్రారంభించి పూర్తి చేయాలని కలెక్టర్ అన్నారు.
జిల్లాలో ప్రతి శనివారం గృహ నిర్మాణాలకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ మీటింగ్ నిర్వహించి గృహ నిర్మాణానికి సంబంధించిన అధికారులతో చర్చించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే వాటిని అక్కడే అక్కడికక్కడే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. ఈ వారం గృహ నిర్మాణం స్టేజ్ కన్వర్షన్ పనులు చాలా మందకోడిగా సాగుతున్నాయని జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేజ్ కన్వర్షన్ పనులు కూడా వేగవతం కావాలని జిల్లా కలెక్టరు పి.ప్రశాంతి ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స లో డిఇఓ ఆర్.వి రమణ, సమగ్ర శిక్ష ఏ పి సి పి. శ్యాంసుందర్, డి ఆర్ డి ఏ పి డి వేణుగోపాల రావు ,డ్వామా పీడి రాజేశ్వరరావు , డి ఎల్ డి ఓ కే సి హెచ్ అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.