విలేకరులతో ఉన్న అనుబంధం మరువలేనిది


Ens Balu
10
Kakinada
2022-11-16 13:43:36

కాకినాడ నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాలకు చెందిన విలేకరులతో తనకున్న అనుబంధం మరువలేనిదని,  విలేకరులకువిద్య,  ఆరోగ్య పరంగా అన్ని విధాల తన వంతు సహాయం నిరంతరం ఉంటుందని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్ల అన్నారు. విలేకరులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య, విద్య,  వైద్య పరంగా తనకు తెలియజేస్తే విధానపరంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని కలెక్టర్ విలేకరులకు భరోసా కల్పించారు. బుధవారం కాకినాడ ఆర్అండ్బి అతిథి గృహంలో కాకినాడ చిన్న మధ్య తరహా దినపత్రికల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమారాధన, జాతీయ పత్రికా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులుగా వారణాసి సూర్యనారాయణ, డాక్టర్ వైవి పరశురాం, అడపా అప్పారావులను పుష్పగుచ్చం అందించి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.

   ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జర్నలిస్టులుగా ఎనలేని సేవలు చేస్తారని కొన్నంటిని ప్రాణాలు తెగించి ధైర్య సాహసాలతో వార్తలను తీసుకొని ప్రచారం చేస్తుంటారని అటువంటి విలేకరులను మరువలేమని ఆమె చెప్పారు. కాకినాడలో తాను జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న కాలం నుండి జిల్లా అన్ని రంగాల్లో ముందుకు పోతుందని ఈసారి పంట అధిక స్థాయిలో దిగుబడి అయిందని, ఇది చాలా మంచి పరిణామన్నారు. అధిక స్థాయిలో దిగుబడి రావడం రైతులకు ఆనందంగా ఉందని చెప్పారు. విలేకరులకు తన అవసరం వచ్చినప్పుడు సహాయం పడతానని చెప్పారు. అనంతరం కలెక్టర్కి విలేకరులు ధన్యవాదాలు తెలిపారు.

  ఈ కార్యక్రమంలో కాకినాడ నగరానికి,  రూరల్ ప్రాంతానికి చెందిన విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్తీక వన సమారాధనతో పాటు జాతీయ పత్రికా దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు.