పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అన్ని రైస్ మిల్లుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులలను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు.బుధవారం రాత్రి స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. బుధవారం పరిశీలించిన ధాన్యం కొనుగోలు సెంటర్లో కొన్ని లోటుపాట్లను గమనించడం జరిగిందన్నారు. సొసైటీలు ఏర్పాటు చేసుకున్న పిపిసి ఏజెన్సీ ప్రెసిడెంట్స్ ఆర్బికేల్లో అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా కోపరేటివ్ అధికారిని ఆదేశించారు. టెక్నికల్ అసిస్టెంట్లకు విధులు కేటాయించడంతోపాటు, అసిస్టెంట్ రిజిస్టర్లు ఆర్.బి.కెలను తరచు సందర్శించేలా చూడాలన్నారు. తొలి విడతలో 34 ఆర్బికేల్లో పి పి సి సెంటర్లను వినియోగంలోకి తీసుకురాగా, నేటికీ వాటి సంఖ్య 67 గా ఉన్నాయన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 153 రైస్ మిల్లులో మాత్రమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మిగిలిన రైస్ మిల్లులో కూడా వెంటనే ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేసి ప్రతిరోజు డేటాను పరిశీలించేందుకు సమర్పించాలన్నారు.
జిల్లాలో ఉన్న 296 ఆర్పీకెలలో సుమారు 400 తేమశాతం కొలిచే యంత్రాలను సిద్ధంగా ఉంచాలన్నారు. ధాన్యం సేకరణ ముగిసిన ఆర్ బి కే ల నుండి ఇతర సెంటర్లకు వాటిని తరలించేందుకు కార్యచరణ రూపొందించుకోవాలన్నారు. బ్యాంక్ గ్యారంటీలను త్వరగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్ఓ ను ఆదేశించారు. జిల్లాలోని ఆర్బికెల్లో ఏ ఏ తేదీల్లో దాన్యం కొనుగోలు జరుగుతుందో షెడ్యూల్ను రూపొందించి ముందుగానే రైతులకు తెలియజేయాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారినీ ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా కోపరేటివ్ అధికారి ఎం. రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి జెడ్. వెంకటేశ్వరరావు, సివిల్ సప్లైస్ డి. ఎం టి శివరాం ప్రసాద్, డీఎస్ఓ ఎన్ సరోజ పాల్గొన్నారు.