ప్లాస్టిక్ నిషేధంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించాలి.


Ens Balu
3
Parvathipuram
2022-11-17 09:43:36

మానవాళికి పెను ముప్పు పొంచివున్న ప్లాస్టిక్ సంచుల నిషేధానికి ప్రత్యేక దృష్టిసారించాలని  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలు, జగనన్న భూ హక్కు సర్వే నిర్వహణ, జాతీయ ఉపాధి హామీ పనులు, జగనన్న స్వచ్ఛ సంకల్పం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో నిబంధనల మేరకు ప్లాస్టిక్ నిషేధం పగడ్బందిగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి ప్లాస్టిక్ సంచుల వాడకం నిర్మూలించడం తోపాటు పరిసరాల పరిశుభ్రత కు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో పూర్తి అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలు ఆర్థికాభివృద్ధి చెంది సుస్థిరమైన ఆదాయం సాధించేలా తోడ్పాటును అందించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో లభించే అటవీ ఉత్పత్తులు మహిళా సంఘాలు ద్వారా విక్రయించి ఆదాయ వనరులను పెంపొందించాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవన నిర్మాణాలు శత శాతం పనులు గ్రౌండింగ్ జరగాలన్నారు. జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలని అన్నారు.
     
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, జిల్లా రెవెన్యూ అధికారి జల్లేపల్లి వెంకట రావు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. రామ చంద్ర రావు,  జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎం.వి.కృష్ణా జి, జిల్లా ఆర్.డబ్ల్యు.ఎస్ ఇంజినీరింగ్ అధికారి ఓ. ప్రభాకర రావు, జిల్లా గ్రామీణాభివద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ పి.కిరణ్ కుమార్, జిల్లా సర్వే, భూ  రికార్డుల శాఖ అధికారి ఆర్. రాజ్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.