గవర్నర్ పర్యటన విజయవంతం చేయాలి


Ens Balu
8
Rajamahendravaram
2022-11-17 09:58:38

తూర్పుగోదావరి జిల్లా అధికారులు, ఆయుష్ విభాగం వారితో సమన్వయం చేసుకుని కార్యక్రమం విజయవంతం చేయాలని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో ముందస్తు ఏర్పాట్లు పై సమీక్ష చేసి, అనంతరం ఆనం కళా కేంద్రం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వ భూషణ్ హరిచందన్  హాజరు కానున్న దృష్ట్యా ఏర్పాట్ల విషయంలో అత్యంత జాగృత్తగా వ్యవహరించాలని అన్నారు.

రాష్ట్ర గవర్నర్ జిల్లా పర్యటనను పూర్తి స్థాయి లో విజయవంతం చేయడం కోసం ఆర్ట్స్ కళాశాల నుంచి.. అధికార విడిది, అక్కడ నుంచి ఆనం కళా కేంద్రంలో  జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకల్లో పాల్గొని సందేశం ఇస్తారన్నారు.  ఉ.10.45 కు ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్, చేరుకుని, మంజీరలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విడిది కి చేరుకుని, స్వల్ప విశ్రాంతి అనంతరం ఉ 11.20 కు బయలుదేరి ఉ.11.30 కి ఆనం కళా కేంద్రానికి చేరుకుంటారన్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, హోం మంత్రి తానేటి వనిత, ఎంపి, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్, అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు, ఆయుర్వేదిక్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నానున్నారని పేర్కొన్నారు. ఉ.11.30 నుంచి మ.12.30 వరకు "జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ " ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని  మ.12.40 కి మంజీర ప్రవేట్ అతిధి గృహంలో స్వల్ప విరామం  ఆర్ట్స్ కళాశాల మైదానం లో ఏర్పాటు చేసిన హెలి ప్యాడ్ కి  మ.1.00 కు చేరుకుని  విజయవాడ కు బయలుదేరి వెళతారన్నారు.

సభా ఏర్పాట్లు, రూట్ మ్యాప్ పై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  మూడు రోజుల పాటు జరిగే జాతీయ ఆయుర్వేదిక్ పర్వ్ వేడుకల సందర్భంగా ఉచిత ఆయుర్ వేద, యునాని , తదితర సంప్రదాయ వైద్య సేవలు ఉచితంగా అందచెయ్యడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. 

ఈ సమావేశంలో ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఏ సి పి జేవి సతీష్, ఆయుష్ జాతీయ జనరల్ సెక్రెటరీ మనోజ్ జెన, రాష్ట్ర కన్వీనర్ బాలు అక్కియా, ఎడిసి పిఎం సత్య వేణి, ఎస్ ఈ పాండురంగారావు,  ప్రభుత్వ ఆసుపత్రి సూరింటెండెంట్ డా ఆర్. రమేష్, ఎస్ డి సి  కె. గీతాంజలి, డ్వామా పీడీ జీ. రామ్ గోపాల్,  డి హెచ్.వో రాధాకృష్ణ,ఎక్సైజ్ ఇనస్పెక్టర్ ఆర్ సిహెచ్. చిట్టిబాబు, డి ఐ పి ఆర్ వో సిహెచ్. శ్రీనివాస్, ఫుడ్ ఇన్స్పెక్టర్, తహశీల్దార్లు, పోలీసు అధికారులు, నగరపాలక సంస్థ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.