జగనన్న కాలనీల్లో మౌళిక వసతులు కల్పించాలి


Ens Balu
19
Amalapuram
2022-11-17 10:02:17

నవరత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం కింద అన్ని లేఔట్లలో మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులను చైతన్య పరుస్తూ గృహ నిర్మాణాలు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా పేర్కొన్నారు. గురువా రం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమం కింద చేపట్టిన గృహ నిర్మాణ పనులు జగనన్న కాలనీ లేఔట్లలో మౌలిక వసతులు కల్పన జగనన్న స్వచ్ఛ సంకల్పం లేవట్ల లెవిలింగు ఇసుక రీచ్ ఆపరేషన్లు తదితర అంశాలు పురోగతిపై రాష్ట్ర పంచాయతీరాజ్ రూరల్ డెవల ప్మెంట్ ,మరియు రాష్ట్ర ప్రత్యేక గ్రామ వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది అజయ్ జైన్లు వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు  ఈ వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు ఉద్దేశించి మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో త్రాగునీరు అంతర్గత రహదారులు రోడ్లు డ్రైన్లు తాగునీరు కరెంట్ కనెక్షన్ వంటి వసతులు కల్పించి లబ్ధిదారులకు అన్ని విధాలుగా ఉత్తేజపరిచి గృహ నిర్మాణాలను చేపట్టి వారం వారం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా అధికారులు లక్ష్యసాధన దిశగా కృషి చేయాలని జిల్లా కలెక్టరు అధికారులను ఆదే శించారు.

నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు పథకం కింద లే ఔట్ల చదును, అంతర్గత రహదా రులు, కల్వర్టుల నిర్మాణం, గృహ నిర్మాణాలు, పీ.ఆర్. ప్రాధాన్యత భవన నిర్మాణాలు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కింద అందిన ఫిర్యాదుల పరిష్కారం, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆదేశిం చారు. నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి స్థాయిలో నెరవేరే విధంగా జిల్లా స్థాయి అధికారులు ఆయా శాఖల క్షేత్రస్థాయిసిబ్బందితో సమన్వయం చేసుకుని పనులలో పురోగతి సాధించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగు ణంగా డిసెంబర్ 21న  సామూహిక గృహప్రవేశాలకు  ఎంపిక చేసిన లేఔట్లలో అన్ని మౌలిక సదుపా యాల పనులను సకాలంలో పూర్తి చేయాలని అధికారులకు కలెక్టరు స్పష్టం చేశారు. గృహ నిర్మాణాలకు అంతరాయం లేకుండా ఇసుక, నీరు, విద్యుత్, ఇతర మౌలిక సదుపాయా లను కల్పించాలనిజిల్లా కలెక్టరు అధికారులను ఆదేశించారు. ప్రతి ఇంటి నుంచి సేకరించిన చెత్తను సక్రమంగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు  తరలించి వర్మి కంపోస్టు తయారీపై దృష్టి పెట్టాల న్నారు.

గడప గడపకు -మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి అందిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు ఇసుక రీచ్ లు ఆపరేషన్లు నిరంతరాయంగా కొనసాగించాలని వర్షాకాలం సీజన్ పూర్తయినందున గృహ నిర్మాణా లను వేగవంతం చేయాలని  ఆయన ఆదేశించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ సత్తిబాబు, సీపీఓ వెంకటే శ్వర్లు డ్వామా పీడీ, ఎస్ మధుసూ దన్ జిల్లా పంచాయతీ అధికారి వి కృష్ణకుమారి, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ సుపరింటెండెంట్ ఇంజనీర్లు, చంటిబాబు సిహెచ్ ఎన్వి కృష్ణారెడ్డి డిఆర్డిఏ పిడి వి శివశంకర్ ప్రసాద్ సర్వే విభాగం ఏడి గోపాలకృష్ణ డిఎంహెచ్వో సిహెచ్ వి భరత లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.