భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం వైపు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసిందని. వైఎస్సార్ జగనన్న భూ శాశ్వత హక్కు, భూరక్ష పథకం ద్వారా సమగ్ర భూ సర్వేను ఆచరణలోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లా అన్నారు. గురువారం రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జి సాయి ప్రసాద్ సిసిఎల్ ఏ కార్యాలయపు కార్యదర్శి ఇంతి యాజ్ ,సర్వే కమిషనర్ సిద్ధార్థ జైన్ అమరావతి నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న శాశ్వత భూ హక్కు రీ సర్వే భూముల డిజిటల్ సంతకాలు సరిహద్దురాల్లు ఏర్పాటు గ్రౌండ్ వాల్యుయేషన్, గ్రౌండ్ ట్రూతింగ్ ఫైనల్ ఆర్వార్ , 13 నోటిఫికేషన్ డ్రోన్లు ,రోవర్ల వినియోగం , ముటేష న్లు ,సర్వేలో ఉత్పన్నమైన ఫిర్యా దులు పరిష్కారం తదితర అంశాల పురోగతిపై జిల్లాల వారీగా సమీక్షిం చి నిర్దేశిత లక్ష్యాలు ఏ మేరకు చేరుకున్నది అడిగి తెలుసుకున్నా రు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దశల వారీగా సర్వే చేపట్టి భూసమస్యలను పరిష్కరిస్తూ వివాదరహిత భూములను భావితరాలకు అందించేందుకు చర్యలు శరవేగంగా కొనసాగుతున్నా యని వందేళ్ల క్రితం సర్వే వివరాలతో రూపొందించిన సర్వే సెటిల్మెంట్ రికార్డు ఇప్పటికీ అమలు చేస్తున్నారని.
సుమారు 100 సంవత్సరాల క్రితం నిర్వహించిన సర్వే ఆధారంగా భూ సంబంధిత లావా దేవీలు కొనసాగిస్తున్నారని. ఒకే సర్వే నెంబర్లు పై పలుమార్లు లావాదేవీలు జరిగాయని. వార సులు ద్వారా పంపిణీలు చేసుకోవడం. బహుమతిగా ఇవ్వడం, క్రయ విక్రయాలు జరిగినా అందుకు అనుగుణంగా సబ్ డివిజన్ భూమి మీద జరగక పోవడంతో తరచూ సమస్యలు తలెత్తుతున్న దృష్ట్యా రీసర్వేను అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్నారన్నారు. నెట్ వర్క్ సాయంతో ప్రక్రియ సాగుతోందని గ్రామాల్లో రైతులకు ఉన్న భూములను గుర్తించి ఆధార్ కార్డుల ఆధారంగా వారి వివరాలను ఆన్లైన్లోనమోదు చేయడం జరుగు తుందన్నారు. అత్యంత పారదర్శ కంగా జవాబు దారితనంతో సర్వే ప్రక్రియ నిర్వహించాలని ఆదేశిం చారు.
జిల్లాలో 93 గ్రామాలకు ఓ ఆర్ ఐ మ్యాపులు వచ్చాయని వాటిలో 13 నోటిఫికేషన్ 60 గ్రామాలకు జారీ చేయడం జరిగిందని 53 గ్రామాలకు రికార్డ్ ల్యాండ్ పార్సిల్ మ్యాపు తయారైందని ఆయన తెలిపారు. గ్రౌండ్ వాల్యుయేషన్ 9 గ్రామాల్లోని గ్రౌండ్ ట్రుతింగ్ ఆరు గ్రామాలలోను పూర్తి అయిందని మూడు గ్రామా లలో సరిహద్దు రాళ్లు ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా 13 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని వాటిలో ఆలమూరు మండలం కలవచర్ల,అమలాపురం మండలం పాలగుమ్మి, రామచంద్రపురం మండలం ఉట్రుమిల్లి గ్రామాలు ఉన్నాయ న్నారు సర్వేలో వచ్చిన ఫిర్యాదుల ను ఎప్పటికప్పుడు పరిష్కరించడం జరుగుతుందన్నారు స్వామిత్వ సర్వే 28 గ్రామ పంచాయతీలో నిర్వహణకు గాను ఓ ఆర్ ఐ మాప్లు వచ్చాయని గ్రౌండ్ ట్రుతింగ్ పూర్త యిందని గ్రౌండ్ వాల్యుయేషన్ పురోగతిలో ఉందన్నారు భూ ఆక్రమణలు భూతగాదాలపై చట్టపరమైన చర్యలు గైకొనడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్తిబాబు, సర్వే విభాగం ఏడి గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.