కాకినాడ జిల్లా కన్స్యూ మర్ ప్రొటెక్షన్ కమిటీ మెంబెర్ గా హెచ్ఎస్ రామకృష్ణ నియ మితులయ్యారు.ఈమేరకు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా ఉత్తర్వులు జారీచేశారని సభ్యులు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ కమిటీ పదవి కాలం 2025 వరకు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగ దారుల సంఘా ల సమైక్య రాష్ట్ర జనరల్ సెక్రటరీ పనిచేస్తూ గత 24సంవత్సరాల నుంచి ఈ విని యోగందారుల చైతన్య ఉద్యమంలో రామకృష్ణ పనిచేస్తు న్నారు. ఇప్పటికి రాష్ట్రలో అజాద్‌కా అమృత్ మ హోత్సవ్లో భాగంగా 696 మండలం కేంద్రాల్లో వి నియోగదారుల రక్షణ చట్టం 2019పై పాఠశాల, కళాశాల స్థాయిలో ప్రతిభ పోటీలు నిర్వ హించి.. పాల్గొ న్న ప్రతివారికి పార్టిసిపేట్ సర్టిఫి కెట్ ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమం 2023 ఆగష్టు 31వరకూ కొన సాగిస్తామని మీడియాకి విడుదల చేసిన ప్రకటనలో రామకృష్ణ తెలిపారు.