మత్స్యకారులు ఆర్ధిక ఉపాది పెంపొందించుకోవాలి..


Ens Balu
16
Thotapalli
2022-11-22 02:47:23

మత్స్యకారులు తోటపల్లి రిజర్వాయర్ లో పెంచుతున్న చేపల ద్వారా ఆర్ధిక  ఉపాది పెంపొందించుకోవాలని పార్వతీపురం ఐటీడిఏ పీఓ సి.విష్ణు పేర్కొన్నారు. విజయనగరం ఫిష్ సీడ్ ఫారంలో అభివృద్ది చేసిన  2లక్షల చేప పిల్లలను ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా తోటపల్లి రిజర్వాయర్ లోకి వేశారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారుల కోసం చేపడుతున్న పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు..సిబ్బంది పాల్గొన్నారు.