PMMSYద్వారా మత్స్యకారులు అభివృద్ది చెందాలి


Ens Balu
89
Vizianagaram
2022-11-22 08:37:10

ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారులు మరింతగా అభివృద్ధి చెందాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆకాంక్షించారు మంగళవారం విజయనగరం జిల్లా పరిషత్ హాల్లో మత్స్యకారులకు పిఎంఎంఎస్వై 11 ద్వారా 31 మోటార్ వాహనాలు, ఐస్ బాక్సులను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని చెప్పారు. మత్సకారులు ఆర్ధికంగా ముందుకి సాగడం ద్వారా ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుందన్నారు.ఈ కార్యక్రమంలో  జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ లు  సూర్యకుమారి, నిశాంత్ కుమార్, ఎమ్మెల్యేలు పాముల పుష్ప శ్రీవాణి, మత్స్యశాఖ ఉప సంచాలకులు ఎన్.నిర్మలకుమారి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాస రావు, బొత్స అప్పల నరసయ్య, అలజంగి జోగారావు, జెడ్పీటీసీ సభ్యులు, సచివాలయ మత్స్య సహాయకులు తదితరులు పాల్గొన్నారు.