యానాంలో ఉ.11దాటితే ప్రాణం పోతున్నా వైద్యం చేయరు
Ens Balu
31
Yanam
2022-11-25 08:30:28
కేంద్రపాలిత ప్రాంతం యానంలోని ప్రజలకు ఆయుష్ శాఖ ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రి సిబ్బంది నుంచి వింత ప్రవర్తన ఎదురౌతోంది. ఉదయం 11దాటితే కళ్లముందు ఏం జరిగినా మందులు ఇచ్చేది లేదని సిబ్బంది తెగేసి చెబుతున్నారు. ప్రభుత్వ నిభందనల ప్రకారం ఎలాంటి రోగి గ్రస్తులైనా ఉ.11గంటలలోపే రావాలని ఆ తరువాత వచ్చినా వైద్యం చేయమని స్పష్టం చేస్తున్నారు. ఖాళీగానైనా ఉండొచ్చుకానీ సమయం దాటిన తరువాత వస్తే వైద్యం చేయకూడదనే నిబంధనలున్నాయని సిబ్బంది చెప్పడం పట్ల సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. యానాం కేంద్రపాలిత ప్రాంతం కావడం ప్రభుత్వశాఖల సిబ్బంది వ్యవహారం ఇక్కడి అడ్మినిస్ట్రేటర్(యూటి ఏరియా ముఖ్య అధికారి) పెద్దగా పట్టించుకోక పోవడం వలన ఆయుష్ శాఖలో హోమియోపతి, ఆయుర్వేద వైద్యసేవలు ఇక్కడి ప్రజలకు దూరమైపోతున్నాయని ఈ ప్రాంత ప్రజలు మండి పడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులున్నది ప్రజలకు వైద్యం చేయడానికా..లేదంటే ప్రత్యేక సమయం పేరుతో వైద్యసేవలు అందించకుండా ఉండేందుకా అంటూ మండి పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని నరేంద్రమోడి ఆయుశాఖను ప్రజలకు పూర్తిస్థాయిలో చేరువ చేయాలని చూస్తుంటే యానాంలోని ప్రభుత్వ హోమియోపతి డిస్పెన్సరీ(ఆయుష్ వెల్ నెస్ కేెంద్రం) సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ప్రస్తుతం చర్చనీయాంశం అవుతోంది.