ఔరా..విశాఖ తీరంలో నేవీడే రిహార్సల్స్ ..


Ens Balu
15
Visakhapatnam
2022-12-01 05:34:27

నేవీ డే వేడుకలకు విశాఖ తీరం ముస్తా బవుతోంది. ఆర్కే బీచ్‌లో యుద్ధనౌకలు, నేవీ హెలికాప్టర్లతో విన్యాసాలు అదుర్స్ అనిపిస్తున్నాయి. డిసెంబర్ 4న జరిగే నేవీ డే వేడుకలకు ఆర్కే బీచ్‌లో కొద్ది రోజులుగా ముమ్మ రంగా రిహార్సల్స్‌ నిర్వహిస్తున్నారు. సముద్రంలో యుద్ధనౌకలు, హెలికాప్టర్ల విన్యాసాలను చూసేందుకు విశాఖ నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు బీచ్‌కు చేరుకుంటున్నారు.దీంతో ఆర్కే బీచ్ సందడిగా మారింది.యుద్ధ సమ యంలో నావికాదళం ఎలా స్పంది స్తుం ది.. శత్రువులపై ఎలా ఎదురు దాడికి దిగుతుందో.. కళ్లకు కట్టినట్లు చూపించారు. తీరానికి వచ్చిన సందర్శకులు ఈ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు.