పోలీసుశాఖలోని అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక పేర్కొన్నారు. శుక్రవారం "పోలీసు వెల్ఫేర్ డే" కార్యక్రమాన్ని జిల్లా కార్యాలయంలో నిర్వహించి. పోలీసు ఎస్ఐ నుంచి కానిస్టేబుల్ వరకూ, హోం గార్డుల నుంచి స్టేషన్ సిబ్బంది వరకూ వారి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు. ముఖ్యమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్టు జిల్లా ఎస్పీ తెలియజేశారు. పోలీసు సిబ్బందికి ఎప్పుడు ఎలాంటి సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం పనిచేస్తుందనే భరోసాని సిబ్బందికి కల్పించారు. అదే సమయంలో పోలీసు స్టేషన్ కి వచ్చిన ప్రజల సమస్యలు కూడా ఇదే తరహాలో పరిష్కరించి ప్రభుత్వం నుంచి సత్వర
న్యాయం జరిగేవిధంగా చూస్తామని ప్రకటించారు.