వారంలో 22వేల హక్కు పత్రాలు పంపిణీ కావాలి


Ens Balu
16
Srikakulam
2022-12-02 10:05:36

రాష్ట్రంలో జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పత్రాల జారీలో జిల్లా ప్రథమ స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ ను భూపరిపాలన ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్ అభినందించారు. హక్కు పత్రాల జారీ, జగనన్న శాశ్వత భూ హక్కుకు సంబంధించిన రీ సర్వే, వివాద స్థలాలపై చర్యలు, మ్యుటేషన్లపై జిల్లా కలెక్టర్లుతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ 
సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వారంలోగా మరో 22 వేల భూహక్కు- భూరక్ష పత్రాలను జారీచేయాలని ఆదేశించారు. జిల్లాలో మిగిలిన రీసర్వే పనులను వచ్చే ఫిబ్రవరి నాటికి ఫ్లైయింగ్ పూర్తి చేయాలన్నారు. రీ సర్వే అనంతరం కొలత రాళ్లు పని పూర్తిచేయాలని వివరించారు. జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకం పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభించడం గొప్ప శుభ పరిణామని, ఇందుకు సహకరించిన జిల్లా కలెక్టరును అభినందిస్తున్నట్లు తెలిపారు.

సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కుదారులకు జగనన్న భూహక్కు - భూరక్ష పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలని, మరో వారంలో 22వేల పత్రాలు జారీచేసేందుకు చర్యలు తీసుకోవాలని 
అన్నారు. గడువులోగా మ్యుటేషన్లు,  తీసుకోవాలని, ఇప్పటివరకు పెండింగులో ఉన్నవాటిపై ఎప్పటికపుడు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్, సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.రాజేశ్వరి, భూసర్వే మరియు రికార్డుల శాఖ సహాయ సంచాలకులు కె.ప్రభాకరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.