పేదలందరికీ ఇళ్ళు పధకం క్రింద విజయనగరం నియోజకవర్గం లో 2 వ విడత ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీ జరుగుతుందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి తెలిపారు. ఈ నెల 7న విజయనగరం నియోజకవర్గం పరిదిలోనున్న సారిక లో పట్టాల పంపిణీ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ఏర్పాట్ల పై డిప్యూటీ స్పీకర్ మేయర్ విజయలక్ష్మి తో కలసి శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్, ఆర్.డి.ఓ సూర్య కళ, మున్సిపల్ కమీషనర్ శ్రీరాములు నాయుడు తో సమీక్షించారు. సారిక లే అవుట్ నందు 3569 ఇళ్ళ స్థలాలను గుర్తించడం జరిగిందని, వాటిలో 47 వార్డులకు సంబంధించిన 3455 మంది అర్హులైన లబ్దిదారులకు కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 7 న వారందరికీ పట్టాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్, రెవిన్యూ శాఖల వారు సమన్వయంగా పని చేసి విజయవంతం చేయాలనీ సూచించారు. వార్డ్ వారీగా లబ్దిదారుల జాబితాలను కార్పొరేటర్లకు అందజేయాలని మున్సిపల్ కమీషనర్ కు సూచించారు.
సచివాలయం ద్వారా లబ్ది దారుల వెరిఫికేషన్ జరగాలని, ఇచ్చిన అడ్రస్ నందు లబ్ది దారు ఉన్నదీ లేనిదీ తనిఖీ చేయాలనీ తెలిపారు. లబ్దిదారులందరినీ వార్డ్ కౌన్సిలర్లు సచివాలయాల సిబ్బంది ద్వారా ఆహ్వానించాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి 3 వేల మంది పైబడి హాజరవుతారని, వారందరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని ఆదేశించారు. మున్సిఅల్ కమీషనర్ శ్రీరాములు నాయుడు ఏర్పాట్ల పై వివరించారు. 4 బ్లాక్ లుగా ఏర్పాటు చేసి లబ్ది దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పట్టాలు ఇచ్చేందుకు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే పట్టాలను తయారు చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా 90 రోజుల ఇళ్ళ పట్టాలన్నీ మజూరు చేయడం జరిగిందని, ఎలాంటి పెండింగ్ లేదని తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ఈ. రేవతీ దేవి, కార్పొరేటర్లు, విజయనగరం ఎం.పి.పి మామిడి అప్పల నాయుడు, తహసిల్దార్ బంగార్రాజు, హౌసింగ్ డి.ఈ , ఎ.ఈ లు పాల్గొన్నారు.