దివ్యంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలి


Ens Balu
18
Srikakulam
2022-12-03 11:17:37

సమాజంలో జీవిస్తున్న అందరూ సమానమేనని,మీరు దివ్యంగులు కాదు సకలాంగులని శ్రీకాకుళం జిల్లా విభిన్నప్రతిబావంతులు, హిజ్రాలు మరియు వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకులు ఎం.కిరణ్ కుమార్ అన్నారు. శనివారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలు, లయన్స్ క్లబ్ సెంట్రల్ శ్రీకాకుళం సంయుక్త నిర్వహణలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాకర్స్, లయన్స్ ప్రతినిధులు సౌజన్యంతో సేకరించిన నగదు, వస్తువులు ఆరుగురు నిరుపేద వికలాంగులకు అందజేశారు. ప్రపంచ వికలాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంపిక చేసిన విభిన్న ప్రతిభావంతులను ఘనంగా సన్మానించారు. అనంతరం సహాయ సంచాలకులు కిరణ్ కుమార్  మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాలో కోటి రూపాయల విలువ కలిగిన ఉపకరణాలు, రుణాలు  ఈ రోజు  అందజేస్తున్నామని అన్నారు. త్వరలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలకు సంబంధించి  స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ఏర్పాటు చేసి  ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న బ్యాక్ లాగ్ పోస్టుల  భర్తీ ఇటీవల చేపట్టామని అన్నారు. అర్హులైన వికలాంగులకు లాప్ టాప్స్, టచ్ ఫోన్లు, చంక కర్రలు, శ్రవణ యంత్రాలు, మూడు చక్రాల సైకిళ్ళు, వీల్ చైర్స్, అంధుల చేతికర్రలు సరఫరా చేస్తున్నామని అన్నారు. 

విభిన్న ప్రతిభావంతుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించే పనులు చేపట్టిన వాకర్స్ సంస్థలు, లయన్స్ క్లబ్ సేవలు మరువరానివని కిరణ్ కొనియాడారు. స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు శాసపు జోగినాయుడు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అధ్యక్షుడు హరికా ప్రసాద్, వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ పి.జి.గుప్తా, లయన్స్ క్లబ్ మాజీ చైర్మన్ డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, మాజీ గవర్నర్లు జి.ఇందిరాప్రసాద్, గుడ్ల సత్యనారాయణ, ఇంటాక్ కో కన్వీనర్ వావిలపల్లి జగన్నాధ నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు బి.వి.రవిశంకర్, బి.దేవీప్రసాద్, గజల్స్ వాసుదేవ్, గోలీ సంతోష్, నల్లబాటి కృష్ణమూర్తి, బొడ్డేపల్లి ప్రసాదరావు, మోనంగి రవి, వూన్న నాగభూషన్ రావు, డాక్టర్ మాదిన ప్రసాదరావు, వంశధార రిటైర్డ్ ఎస్.ఈ.పి. రంగారావు, కిల్లారి రవి,ఎం.మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు.