సచివాలయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నోడల్ అధికారి కె.రామచంద్ర రావు అన్నారు. గ్రామ వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి. చిట్టిబాబు ఆధ్వర్యంలో కురుపాం, పార్వతీపురం నియోజకవర్గంలో ఉన్న డిజిటల్ అసిస్టెంట్స్, వార్డ్ విద్యా, డేటా ప్రోసెసింగ్ కార్యదర్సులకు జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శిక్షణా కార్యక్రమాన్ని శని వారం నిర్వహించారు. ఈ సందర్బంగా రామ చంద్ర రావు మాట్లాడుతూ సచివాలయాలు అందిస్తున్న సేవలపై ప్రజలకు అవగాహన పెంపొందించుటకు కృషి చేయాలని తెలిపారు. సచివాలయంలో సేవలు పొందేవారి సంఖ్య పెరగాలని, సిబ్బంది అందరూ తప్పనిసరిగా విధులకు హాజరు కావలని అన్నారు. రికార్డులు కచ్చితంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహిస్తున్న విస్తృత సేవలపై ప్రజలకు వాలంటీర్ ద్వారా అవగాహన పెంపొందించాలని తెలిపారు. జిల్లా కలెక్టరు నిశాంత్ కుమార్ కు సచివాలయ వ్యవస్థపై నమ్మకం ఉందని, నమ్మకాన్ని నిలుపుకొనే విధంగా సచివాలయ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందించాలన్నారు.
సచివాలయంలో ఉన్న ఉద్యోగులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఇ - సర్వీస్ లో బిల్స్ పెండింగ్ లో ఉండరాదని, పెండింగ్ లో ఉన్నయడల వెంటనే చెల్లించాలన్నారు. త్వరలోనే నోడల్ అధికారులను నియమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ డి సి ప్రహలాద్, యస్ బి సి సి డి సి శ్రీను, ఏపీ ఆన్లైన్ డి సి రాజేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.