ప్రణాళికా బద్దంగా ఓటరు జాబితాలు సిద్ధం చేయాలి


Ens Balu
29
Bhimavaram
2022-12-03 13:35:33

 తప్పులులేని ఓటర్ల జాబితా తయారు చేసేందుకు  ప్రణాళిక రూపొందించుకోవాలని ఓటర్ నమోదు పరిశీలన అధికారి, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వి శేషగిరి బాబు అన్నారు.  శనివారం స్థానిక జిల్లా కలెక్టరు కార్యాలయం స్పందన  సమావేశ మందిరంలో  జిల్లా కలెక్టరు పి. ప్రశాంతి  తోకలిసి ఎం వి శేషగిరిబాబు ఎలక్ట్రోరల్  రోల్స్ స్పెషల్ సమ్మరీ రివిజన్ పై సంబంధిత అధికారులతో సమీక్షించారు. 

 ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్వచ్ఛమైన ఓటర్లు జాబితా రూపొందించేందుకు స్వీప్ యాక్టివిటీ ఎక్కువగా చేయాలని ఆయన సూచించారు.  క్లైములు ఎంక్వయిరీ చేసేటప్పుడు ఖచ్చితమైన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ రికార్డు మైంటైన్ చేయాలని ఆయన  అన్నారు . గరుడ యాప్ గురించి బిఎల్ఓ లకు శిక్షణ ఇవ్వాలని ,  డేటా ఎప్పటికప్పుడు అప్లోడ్ చేయాలని ఆయన అన్నారు.  తప్పుల  లేని ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్వోలు   పనిచేయాలని ఎం వి శేష గిరి బాబు సూచించారు .

    జిల్లా కలెక్టరు   ప్రశాంతి మాట్లాడుతూ  ఓటర్ల జాబితాలో చేర్పులు ,మార్పులు ఉన్నట్లయితే వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టరు అన్నారు ఒకే ఓటర్ రెండు సార్లు నమోదు కాకుండా జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు.  ప్రతి పోలింగ్ స్టేషన్లో  డిసెంబర్ 4  తేదీన ఓటర్ల నమోదు, తప్పొప్పుల సవరణ కు ప్రత్యేక క్యాంపు నిర్వహించలన్నారు. క్యాంపు నిర్వహణ తేదీల్లో బిఎల్ఓలు  పొలిటికల్ పార్టీలు నియమించిన ఏజెంట్లతో పాటు ఓటర్ లిస్టులతో సిద్ధంగా ఉండాలన్నారు.  ఓటు నమోదుకు దరఖాస్తు స్వీకరణతో పాటు, ఓటరుకు ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పి.ప్రశాంతి సూచించారు.

ఈ సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నియోజకవర్గాల వారీగా  భీమవరం ఆర్డీవో  దాసి రాజు,  తణుకు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి Z. వెంకటేశ్వరరావు , తాడేపల్లిగూడెం హార్టికల్చర్ ఏ డి ఎ.దుర్గేష్, ఆచంట  జిల్లా పరిశ్రమల శాఖ  జి ఎం  వి.ఆదిశేషు,  ఉండి జిల్లా కోపరేటివ్ అధికారి ఎం. రవి కుమార్ , పాలకొల్లు చేనేత జౌలి శాఖ ఏ డి అప్పారావు,బిజెపి పార్టీ కోమటి. రవి కుమార్,కాంగ్రెసు పార్టీ యం. శేఖర్, వైయస్సార్ పార్టీ కామన. నాగేశ్వర రావు, టిడి పి పార్టీ యం. శ్యాంబాబు, సి పి ఐ పార్టీ కే. భీమారావు, సి పి యం పా ర్టీ జె యన్ వి గోపాలం, పురపాలక సంఘం కమిషనర్లు, తది తరులు పాల్గొన్నారు.
సిఫార్సు